సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేగింది.. సాక్షాత్తు మేయర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భర్త, అత్త, పీఆర్‌ఓకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్‌గా తేలింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మేయర్‌కు పాజిటివ్‌గా తేలడంతో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో పాల్గొన్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడటంతో వారందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా.. మేయర్‌ను కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
కామారెడ్డి: జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 35కు పైగా కుటుంబాలకు కరోనా బారినపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఇంటిల్లిపాది మొత్తానికి కరోనా వైరస్ సోకుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. (వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం)
Comments
Please login to add a commentAdd a comment