చెప్పుతో కొట్టుకున్నకార్పొరేటర్
Published Mon, Jun 5 2017 2:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ టీడీపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. తన డివిజన్ పై నిర్లక్ష్యం చూపుతున్నారంటూ మున్సిపల్ కమిషనర్ మూర్తి ఎదుట టీడీపీ కార్పొరేటర్ ఉమా మహేశ్వర్‌రావు చెప్పుతో కొట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల తీరుపై ఊగిపోయిన అధికారపార్టీ కార్పొరేటర్ ఉమా చర్యతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.
Advertisement
Advertisement