బాలీవుడ్ హీరోకు నోటిసులు | municipal Corporation Notice To Shahid Kapoor | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హీరోకు నోటిసులు

Published Sat, Sep 17 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

బాలీవుడ్ హీరోకు నోటిసులు

బాలీవుడ్ హీరోకు నోటిసులు

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు మున్పినల్ కార్పోరేషన్ వారు నోటీసులు జారీ చేశారు. షాహిద్ వ్యక్తిగతంగా ఉపయోగించే స్విమింగ్ పూల్లో డెంగీ వ్యాప్తి చేసే దోమలు పెరుగుతున్నట్టుగా గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. చాలా రోజులుగా పూల్లో నీరు మార్చకపోవటమే ఇందుకు కారణం అయి ఉంటుందని భావిస్తున్నారు. షాహిద్ ఉంటున్న అదే అపార్ట్మెంట్లోని మరో స్విమింగ్ పూల్ ఓనర్కు కూడా ఇదే కారణంతో నోటిసులు జారీ చేశారు.

అయితే షాహిద్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే నివాసం ఉంటున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఆమెకు డెంగీ సోకినట్లుగా అనుమానిస్తున్న అధికారులు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో స్విమింగ్ పూల్లో డెంగీ కలిగించే దోమలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement