కొత్తపట్నం ఏర్పాటు ఇలా.. | New Municipal Corporations in Hyderabad | Sakshi
Sakshi News home page

కొత్తపట్నం

Jul 18 2019 11:31 AM | Updated on Jul 18 2019 11:31 AM

New Municipal Corporations in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరం చుట్టూ మరో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నిజాంపేట్, బండ్లగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్‌లను సమీప ప్రాంతాలను చేర్చి కార్పొరేషన్లుగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిపై ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు శాసనసభకు ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. మహానగరంలో కలిసిపోయినశివారు ప్రాంతాలను మున్సిపాలిటీలుగా కొనసాగించాలా లేక, జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలా అన్న అంశంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఒక దశలో జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి శివారు ప్రాంతాలను విలీనం చేయాలన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. చివరకు కొత్తగా ఆరు కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక నగరంలో పూర్తిగా కలిసిపోయిన మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌ తదితర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.  

ఏర్పాటు ఇలా..
నిజాంపేట్‌: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్‌
బోడుప్పల్‌: బోడుప్పల్, చెంగిచర్ల
ఫిర్జాదిగూడ: ఫిర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి
జవహర్‌నగర్‌
బండ్లగూడ: హైదర్షాకోట్, పీరంచెరువు, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్‌
బండంగ్‌పేట్‌: జిల్లెలగూడ, మీర్‌పేట్, అల్మాస్‌గూడ, నాదర్‌గుల్, కుర్మల్‌గూడ, బాలాపూర్, మామిడిపల్లి, మల్లాపూర్, బాలాజీనగర్, సుల్తాన్‌పూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement