danger bells
-
శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్‌లో గుర్రపు డెక్క
-
డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 151కి చేరింది. ఇది చాలా అనారోగ్యకరమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నగరాన్ని పొగమంచు కప్పేయడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్బంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. దట్టమైన విషపూరిత పొగమంచు కప్పివేయడంతో శ్వాసకోశ , హృదయ సంబంధిత సమస్యలకు కారణమ వుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆన్లైన్లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలు చేపట్టినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto , CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చని డెలాయిట్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సేల్స్ టీమ్‌కు సూచించినట్లు నివేదిక తెలిపింది. క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto తన రైడర్లకు N95 మాస్క్‌లను అందించింది. ఆన్-కాల్ మెడికల్ సపోర్టును అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి సంస్థ నిర్దిష్ట చర్యలను అమలు చేయలేదని, అవసరమైతే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు మేక్మైట్రిప్ చీఫ్ హెచ్ఆర్ శివరాజ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున
న్యూఢిల్లీ/సిమ్లా/జైపూర్: ఉత్తరభారతంలో మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగింది. ఆకస్మిక వరదల్లో వాహనాలు, రహదారులు కొట్టుకుపోయాయి. పంటపొలాలు, నివాసప్రాంతాలు నీటమునిగాయి. వానల ప్రభావం హిమాచల్ ప్రదేశ్‌పైనే ఎక్కువగా పడింది. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది, పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్‌లో ఏడుగురు, యూపీలో ముగ్గురు చనిపోయారు. దీంతో ఉత్తరాదిన వరదల్లో ఇప్పటిదాకా 37 మంది చనిపోయారు. హిమాచల్‌లోని వివిధ ప్రాంతాల్లో 200 మంది పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రధాని మోదీ సోమవారం సీనియర్ మంత్రులు, అధికారులతో కలిసి ఉత్తరాదిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని కోరారని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలతో మాట్లాడి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం మరో నలుగురు చనిపోయారు. సిమ్లా–కాల్కా హైవేలో కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా–కాల్కా మార్గంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడటంతో మంగళవారం వరకు రైళ్ల రాకపోకలను ఆపేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా 120 రోడ్లపై రాకపోకలు బందయ్యాయని, 484 నీటి సరఫరా పథకాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. జూలై 1–9 తేదీల మధ్య సాధారణ వర్షపాతం 160.6 మిల్లీమీటర్లకు మించి 69 శాతం ఎక్కువగా 271.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌పుర విద్యుత్ప్లాంట్లోకి చేరిన నీరు ఎగువనున్న హరియాణాలోని హత్నికుండ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదిలో వరద పెరుగుతోంది. సోమవారం మధ్యాహా్ననికి ప్రమాద స్థాయి దాటి 205.33 మీటర్లకు చేరింది. మంగళవారం మధ్యాహా్ననికి 206.65 మీటర్లకు చేరి, క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నదిలో నీరు 206 మీటర్ల మార్కును దాటితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. యమునా నదికి అత్యంత సమీపంలో సుమారు 41 వేల మంది నివసిస్తున్నట్లు అంచనా. గత ఏడాది సెపె్టంబర్లో రెండుసార్లు యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహించింది. పంజాబ్, హరియాణాల్లో వానల తీవ్రత సోమవారమూ కొనసాగింది. పంజాబ్ రాష్ట్రం పటియాలా జిల్లాలోని రాజ్‌పుర విద్యుత్ ప్లాంట్‌లోకి వరద చేరడంతో 700 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మూసివేశారు. సట్లెజ్ యయునా లింక్ కెనాల్ పొంగిపొర్లి రాజ్‌పురలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోకి నీరు చేరింది. ఆస్పత్రుల్లోకి చేరిన వరద రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టాలపైకి, జేఎల్ఎన్ ఆస్పత్రి వార్డుల్లోకి వరద నీరు ప్రవేశించింది. టోంక్‌లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, బదౌన్ జిల్లాల్లో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. షహరాన్‌పూర్‌లో 15 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిన మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్‌లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్‌కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్! ఇప్పటికే 9 మంది మృతి.. లక్షణాలివే!
లండన్: మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్ వచ్చిపడింది. మార్బర్గ్ వైరస్ డిసీస్ (ఎంవీడీ)గా పిలిచే దీని తాలూకు తొలి కేసు గత వారంలో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్ గినియాలో నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి దీని లక్షణాలు. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది. ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌కు ఇప్పటిదాకా చికిత్సేమీ లేదు! గినియాలోని కీటెం ప్రావిన్స్‌లో దీని బారిన పడి అప్పుడే 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘వారందరిలోనూ గుర్తు తెలియని హెమరేజ్ జ్వరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా మార్బర్గ్ సోకినట్టు అనుమానమున్న 200పై చిలుకు మందిని క్వారెంటైన్ చేశారు’’ అని వెల్లడించింది. దాంతో పొరుగునున్న కామెరూన్ సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత పెంచింది. ఏమిటీ వ్యాధి? ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. దీనిబారిన పడ్డవారిలో ఏకంగా 88 శాతం మంది మృత్యువాత పడుతున్నారు! 1967లో జర్మనీ, సెర్బియాల్లో ఎంవీడీ ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ గ్రీన్ మంకీస్ ద్వారా ఇది సోకినట్టు అప్పట్లో తేల్చారు. గబ్బిలాల వంటివాటికి ఆవాసమైన గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్ సోకుతుంది. పైగా ఇది అంటువ్యాధి కూడా. ఒకరి నుంచి మరొకరికి సులువుగా, అతి వేగంగా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, ఆయాసంతో మొదలై మూడో నాటికల్లా పొత్తి కడుపు నొప్పి, విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి. కళ్లన్నీ లోపలికి పోయి, మనిషి పీక్కుపోయి అచ్చు దెయ్యాన్ని తలపిస్తాడు. కేంద్ర నాడీవ్యవస్థ పనితీరు కూడా బాగా మందగిస్తుంది. చికిత్స లేదు దీనికి ఇప్పటిదాకా మందు గానీ, వ్యాక్సీన్ గానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇదమిత్థంగా చికిత్స కూడా లేదనే చెప్పాలి. అసలు తొలి దశలో ఎంవీడీని గుర్తించడం కూడా చాలా కష్టం. -
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్‌కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్‌కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్‌కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్‌గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్‌పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్‌లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్‌లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ–వ్యర్థాలతో అనర్థాలే! మూడో స్థానంలో భారత్.. సవాల్‌గా నిర్వహణ
సాక్షి, అమరావతి: దేశంలో ఎలక్ట్రానిక్ (ఈ)–వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. ఏటా టీవీలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల కొనుగోలు 35 శాతం పెరుగుతోంది. మరోవైపు పాత వస్తువుల రూపంలో 33 శాతం వ్యర్థాలుగా మారిపోతున్నాయి. 2021–22లో 17,86,396.65 టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడ్డాయి. వీటిలో కేవలం 3,93,007.26 టన్నులను ((22 శాతం) మాత్రమే సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ (పునర్వినియోగంలోకి తేవడం) చేశారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఈ–వ్యర్థాలు దేశంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ–వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల భూమి వేడెక్కి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఇది రుతుపవనాల గమనాన్ని దెబ్బతీయడానికి దారితీస్తోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్‌తోపాటు నికెల్, లెడ్, క్రోమియం, అల్యూమినియం వంటి విషతుల్యమైన లోహాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భజలాలు కలుషితమై ప్రజలు చర్మ, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు ప్రాణాంతక క్యాన్సర్ల బారినపడుతున్నారు. జంతువులు సైతం మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు.. ఈ–వ్యర్థాలను సేకరించడం, శాస్త్రీయంగా నిర్మూలించడం లేదా రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుండగా అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఏటా 22 శాతం ఈ–వ్యర్థాలను మాత్రమే సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల టన్నుల్లో ఈ–వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ–వ్యర్థాల నిర్మూలనకు సంబంధించి 2016లో రూపొందించిన చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది. 2029 నాటికి ఏటా 32.30 లక్షల టన్నుల వ్యర్థాలు.. దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతున్నట్టే వాటి వ్యర్థాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాలను వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2028–29 నాటికి దేశంలో ఈ–వ్యర్థాలు ఏటా 32.30 లక్షల టన్నులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. 2021–22లో 17.86 లక్షల టన్నుల ఈ–వ్యర్థాలు వెలువడడం గమనార్హం. ఈ–వ్యర్థాలను అత్యధికంగా వెలువరించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నాయి. ఈ–వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్మూలించడం, రీసైక్లింగ్ చేయడం కోసం 2016లో కేంద్రం చట్టం తెచ్చినా.. అమలులో అధిక శాతం రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. -
వణికిస్తున్న లంపీ ముప్పు.. రోజుకు 600–700 ఆవులు మృత్యువాత
దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ). కాప్రిపాక్స్ అని పిలిచే ఈ వైరస్ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి. రాజస్తాన్‌లో పశువులపై తీవ్ర ప్రభావం లంపీ స్కిన్ వ్యాధి రాజస్తాన్‌లో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వ్యాధితో రాష్ట్రంలోనే ఏకంగా 57,000 ఆవులు మరణించగా, మరో 11 లక్షల ఆవులు దీని బారిన పడ్డాయి. రోజుకి సగటున 600–700 ఆవులు మరణిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి 15–18 శాతం తగ్గిపోయింది. దీంతో పాలు, వాటితో తయారు చేసే స్వీట్ల ధరలు బాగా పెరిగిపోయాయి. రోజుకు 5–6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయిందని రాజస్థాన్ కో ఆపరేటివ్ డెయిరీ వెల్లడించింది. రాజస్తాన్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతలు ఈ వ్యాధి నివారణకు రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ భారతీయ జనతా పార్టీ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ నిరసనకారులు బారికేడ్లు దూకి మరీ అసెంబ్లీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలా సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాధి తీవ్రత గురించి అందరికీ తెలియజేయడానికి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక ఆవుని కూడా తోలుకొని వచ్చారు. వ్యాధి సోకిన పశువులకి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై కేంద్రమే స్పందించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 13 రాష్ట్రాల్లో పశువులకి ఈ వ్యాధి సోకడం వల్ల జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి సాయం అందించాలన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ వైరస్? దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు. మనుషులకు సోకదు లంపీ స్కిన్ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్ (మనుషులకు సంక్రమించదు) వైరస్ కాదని, మనుషులకు సోకదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. పరిష్కారమేంటి? ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్ వైరస్ నిరోధక వ్యాక్సిన్ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్ ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్ సైన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి.ఎన్. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. -
ఏం పాపం చేశాం.. మాకు బతకాలని ఉంటుంది.. దగ్గరకు రాకండి ప్లీజ్!
ఆరిలోవ(విశాఖ తూర్పు): పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జనావాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 4(శనివారం)న ప్రపంచ వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. విశాఖ నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగింది. భారీగా నివాసాల కొరత ఏర్పంది. స్థలాల ధర చుక్కలను తాకుతోంది. దీంతో పేద జనం అడవులు, కొండలను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. కంబాలకొండ, సీతకొండ, ఎర్రకొండ, ఎండాడ కొండలు, అమనాం ప్రాంతాల్లో దట్టమైన రిజర్వ్డు ఫారెస్టుకు చెందిన కొండలున్నాయి. వీటిలో కంబాల కొండలో 17,600 ఎకరాలు, సీతకొండలో 800, ఎర్రకొండలో 800, అమనాం ప్రాంతంలో 920 ఎకరాల విస్తార్ణంలో అడువులుండేవి. కొన్నేళ్లుగా ఆ అడవులు ఆక్రమణకు గురై విస్తీర్ణం తరిగిపోయింది. ఒకప్పుడు సుమారు 1,000 ఎకరాల్లో రుషికొండ ప్రాంతంలో కొండలుండేవి. వీటిలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌సిటీ వెలిశాయి. దీంతో అక్కడ అటవీ ప్రాంతమంతా కనుమరుగైంది. ఈ కొండలన్నింటిలోను సుమారు 8 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎండాడ కొండల్లో నాలుగు చిరుతలు సంచరించేవని, ఇక్కడ నిర్మాణాలు జరగడంతో వాటి జాడ కనిపించలేదు. చిరుతలకు ఆహారమైన జింకలు, కనుజులు, నక్కల సంఖ్య కూడా తగ్గతుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో ఆహారం కోసం చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుతలు అడవుల్లో సుమారు 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తాయి. సీతకొండ, ఎర్రకొండ, అమనాం ప్రాంతాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో రాత్రివేల ఆహారం కోసం చిరుతలు తిరుగుతూ అడవులు సమీపంలోని నివాసాలలోకి చొరబడుతున్నాయి. గతంలో అమనాం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, మధురవాడ ప్రాంతాల్లో చిరుతలు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు తెలిసిందే. 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం వన్యప్రాణులను సంరక్షించాలనే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా సీఐటీఈఎస్ అనే సంస్థ 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోను అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జంతువుల ఆవాసాలను రక్షించడం, వన్యప్రాణులను వేటాడం చేయకుండా చూడడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందిరాగాంధీ జూలో వరుసగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది. ప్రస్తుతం తుపాన్ కారణంగా జూలో అధికారులు వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ జూలో వన్యప్రాణులు నగరంలో 625 ఎకరాల అటవీ విస్తీ్తర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కులో అనేక రకాల వన్యప్రాణులున్నాయి. ఇక్కడ వివిధ రకాలకు చెందిన సుమారు 830 వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి. రామచిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, మైనాలు, ఆస్ట్రిచ్‌లు, ఈమూలు, రంగురంగుల పిట్టలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు, నీటి ఏనుగులు, ఖడ్గమృగం, జిరాఫీలు, జీబ్రాలు, చింపాంజీలు, కనుజులు, జింకలు, కొండగొర్రెలు, అడవి కుక్కలు, హైనాలు తదితర వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటాం. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా జూకి సెలవు ప్రకటించడంతో జరుపుకోలేకపోతున్నాం. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుంగా చూడాలి. –నందని సలారియా, జూ క్యూరేటర్. -
Covid Omicron Variant: మాటేసే ఉంది.. మాస్క్ వేద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కేసులు తగ్గి, సాధారణ జనజీవనం మొదలైన కొద్దినెలల్లోనే ‘ఒమిక్రాన్’ వేరియంట్ రూపంలో కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతుండగా.. మన దేశంలో, రాష్ట్రంలో కూడా అదే జరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి.. అన్నిరంగాలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, వైరస్‌పై భయం తగ్గడంతో జనం మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలను పక్కనపెట్టారు. ఫంక్షన్లు, పార్టీలు, రద్దీ ప్రదేశాల్లో గుమిగూడటం పెరిగింది. దానికితోడు విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలుచోట్ల పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త వేరియెంట్‌గానీ వస్తే.. పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. (చదవండి: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి) పెరుగుతున్న పాజిటివిటీ రేటు కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది చాలా స్వల్పంగా ఉన్నా.. ప్రజలంతా జాగ్రత్తలు పాటించకుంటే వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వారం కింద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రోజుకు సగటున 40 కరోనా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 75కు చేరింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోనూ స్వల్పంగా కేసులు పెరుగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 19న 31వేల కరోనా టెస్టులు చేయగా.. 137 మందికి పాజిటివ్ వచ్చింది. 26న 33వేల టెస్టులు చేయగా 171 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి కోవిడ్ విభాగంలో 55 చికిత్స పొందుతున్నారు. ఇందులో 35 మంది కోవిడ్ బాధితులుకాగా.. మరో 20 మంది బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నవారు. టిమ్స్ ఆస్పత్రిలో కూడా బాధితులు పది మందిలోపే ఉన్నారు. అయితే ఇటీవల ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. గుమిగూడే చోట పెద్ద సంఖ్యలో కేసులు గుంపులుగా జనం ఉండే ప్రాంతాలు, నిత్యం రద్దీ ఉండేచోట్ల కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అలాంటి చోట్లకు వెళ్లే వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. గత కొద్దిరోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇటీవల ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఒకేరోజు 30 మందికి పాజిటివ్‌గా తేలింది. సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోనూ రెండంకెల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కళాశాలలు, పాఠశాలలు పూర్తిస్థాయిలో కొనసాగుతుండటంతో భౌతికదూరాన్ని పాటించడం కష్టంగా మారిందని.. మాస్కులు, శానిటైజేషన్ వంటి నిబంధనలు సరిగా పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. మాస్కులేవి.. భౌతికదూరమేదీ? కోవిడ్ నియంత్రణలో కీలకమైన కనీస నిబంధనలను జనం సరిగా పాటించడం లేదు. చాలా మంది మాస్కులు కూడా ధరించడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ సహకారంతో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 82.5శాతం మంది ఎలాంటి మాస్కు ధరించడం లేదని సర్వేలో తేలింది. మిగతా 17.5శాతం మంది మాస్కుపెట్టుకుంటున్నా.. అందులో సగం మంది సరిగా ధరించడం లేదని వెల్లడైంది. ముక్కు, నోరు పూర్తిగా కప్పేలా గాకుండా నామ్కేవాస్తేగా తగిలించుకుంటున్నట్టు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో అవసరమైతే తప్ప ఏ వస్తువును తాకవద్దని, క్రమం తప్పకుండా చేతులను హ్యాండ్వాష్తోగానీ, శానిటైజర్‌తోగానీ శుభ్రం చేసుకోవాలనే నిబంధనను చాలా మంది పాటించడం లేదని తేలింది. ఇక వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతికదూరాన్ని పాటించాలన్న నిబంధన అసలే అమలుకావడం లేదని వెల్లడైంది. ఆ సర్వే వివరాలను పరిశీలించిన వైద్యారోగ్యశాఖ.. అందరూ మాస్కులు పెట్టుకోవాలని వారం కింద ప్రకటన జారీ చేసింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించని పరిస్థితి ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు దక్షిణాఫ్రికాలో కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియెంట్ ఇంతకుముందటి డెల్టా కంటే ప్రమాదకరమైంది. వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ ఈ వైరస్‌ను దీటుగా ఎదుర్కొంటాయా? లేదా అనేది ఇంకా తేలలేదు. ఇందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. చాలా మంది కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నామనే ధీమాతో మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల పేరుతో పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి కేసుల సంఖ్య పెరుగుతోంది నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలను ఎవరూ సరిగా పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించడాన్ని దాదాపు మర్చిపోయారు. వివిధ కారణాలతో ఆస్పత్రులకు వచ్చేవారు, ఫ్రంట్లైన్లో పనిచేస్తున్న వారు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. మిగతావారిలో చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించడమే పరిష్కారం. – డాక్టర్ భరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ శంషాబాద్ విమానాశ్రయంలో అలర్ట్ శంషాబాద్: కరోనా కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. నిజానికి ‘ఒమిక్రాన్’ వ్యాప్తి ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాల రాకపోకలు లేవు. కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు హాంకాంగ్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నా.. ప్రస్తుతం నడవడం లేదు. అయితే ప్రయాణికులు ఇతర దేశాల మీదుగా వచ్చే అవకాశాలు ఉండటంతో.. అందరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వస్తే.. క్వారంటైన్‌కు.. విదేశాల నుంచి వచ్చేవారు ఆయా దేశాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నా కూడా.. ఇక్కడ మరోసారి పరీక్షలు చేసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టుల ముఖ్య వైద్యాధికారి అనురాధ తెలిపారు. ప్రయాణికుల్లో ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. వారిని క్వారంటైన్‌కు పంపడంతోపాటు ఏ వేరియెంట్ సోకిందనేది నిర్ధారించుకునే ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అతిగా ఆందోళన వద్దు ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ వస్తున్నవారిలో చాలా వరకు సాధారణ లక్షణాలే ఉంటున్నాయని.. సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అందులోనూ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉంటోందని అంటున్నారు. టీకా తీసుకోని వారిలో మాత్రం వైరస్ ప్రభావం కాస్త ఎక్కువగా కనిపిస్తోందని చెప్తున్నారు. అందువల్ల మరీ అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కోవిడ్ జాగ్రత్తలను పక్కాగా పాటించాలని సూచిస్తున్నారు. కరోనాకు అనుకూల సమయమిది ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే కరోనా వైరస్ విస్తరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఇదివరకే గుర్తించారు. ప్రస్తుతం చలికాలం మొదలవడంతో కరోనాకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్ హాళ్లు వంటిచోట్ల గాలిలో వైరస్ ఉండే అవకాశాలు పెరుగుతున్నాయని.. కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకోనివారు, 18ఏళ్ల లోపు విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చాపకింద నీరులా.. దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగుచూసిన ‘ఒమిక్రాన్’ వేరియంట్.. మన దేశంలో రెండోవేవ్‌కు కారణమైన ‘డెల్టా’ కంటే 40 శాతం వేగంగా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా సుమారు 15 దేశాలు దక్షిణాఫ్రికా, దాని పరిసర దేశాల నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి. కోవిడ్ నిబంధనలు పాటించండి: ప్రధాని ‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై మన దేశంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హైఅలర్ట్ ప్రకటించాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కరోనా టెస్టులు చేస్తున్నాయి. మరోవైపు ఈ పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని.. అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే అంశాన్ని పునః సమీక్షించాలని ఆదేశించారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతో.. మన రాష్ట్రంలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పలు కాలేజీలు, పాఠశాలల్లో పదుల కొద్దీ కేసులు బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి హరీశ్‌రావు ఆదివారం పరిస్థితిని సమీక్షించనున్నారు. డేంజర్ బెల్స్.. ‘ఒమిక్రాన్’ కొత్త వేరియంట్ వ్యాప్తి వేగం ఎక్కువ ఐదు దేశాల్లో ఈ కేసులు గుర్తించారు రాష్ట్రంలో 82.5 శాతం మాస్కులు పెట్టుకోవట్లేదు. మిగతా 17.5% మందిలోనూ సగం మంది సరిగా ధరించడం లేదు. 90% మంది భౌతికదూరం, శానిటైజేషన్ పాటించడం లేదు ఫంక్షన్లు, పార్టీలు, రద్దీ ప్రదేశాల్లో గుమిగూడటం ఎక్కువైంది అప్రమత్తంగా ఉండాలి ‘ఒమిక్రాన్’తో ప్రమాదమెంతో ఇంకా తేలలేదు వ్యాప్తి వేగంగా ఉన్నా..లక్షణాలు తక్కువే ‘సాక్షి’ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ విషయంగా ఇప్పుడే అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే చాలు అని ప్రముఖ వైరాలజిస్ట్, సీఎంసీ వెల్లూరు ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందే తప్ప.. లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయని వివరించారు. టెస్టింగ్, ట్రాకింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్లను పెంచడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఒమిక్రాన్’ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గగన్‌దీప్ కాంగ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ఇంకా పరిశీలించాల్సి ఉంది.. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా.. ప్రభావం, ప్రమాదం తక్కువగా ఉన్నట్టు ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. కేసుల పెరుగుదల తీరు ఎలా ఉంది, తీవ్రమైన జబ్బుగా మారుతోందా అన్న దానిపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. వ్యాక్సిన్‌కు లొంగుతుందా, లేదా అన్నది కూడా తెలియదు. ఇదేదో ప్రమాదకరమైనదని ముందే ఆందోళన వద్దు. ఇప్పటికైతే ఇది మైల్డ్ డిసీజ్‌గా (తక్కువ లక్షణాలు కలిగించేలా) ఉంది. తీవ్రత పెరిగి ప్రమాదకరంగా మారితేనే భయపడాలి. పూర్తి స్పష్టత వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవడం మంచిది. ఇప్పుడు కాకపోయినా కొంత ఆలస్యంగానైనా కొత్త వేరియెంట్ దేశంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కోవిడ్ జాగ్రత్తలే కీలకం కరోనా వేరియంట్ ఏదైనా సరే.. మాస్కులు ధరించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఇతర కోవిడ్ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలి. ఒకేచోట ఎక్కువమంది గుమిగూడొద్దు. అందరూ రెండు డోసుల టీకా తీసుకోవాలి. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలి. మరో వేవ్ రాదని అనుకోలేం.. వైరస్ ఏదైనా చివరికి ఎండెమిక్ (అంతర్ధాన దశ)గా మారుతుంది. కానీ కొత్త వేరియెంట్లు వచ్చి.. ముందటి వేరియంట్ల కంటే పూర్తి భిన్నంగా, కొత్తగా ఉంటే మాత్రం అది మరో మహమ్మారిగా మారుతుంది. మన దేశంలో రెండోవేవ్ తగ్గాక ఎండెమిక్ పరిస్థితి కనిపించింది. అలాగని మరో వేవ్ రాదని కాదు. ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తేలాల్సి ఉంది. ఎక్కువ మందికి సోకుతూ, రోగనిరోధక శక్తిని తప్పించుకునేలా ఉంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పుడే బూస్టర్ డోసు వద్దు కొత్త వేరియంట్ పేరుతో ఇప్పటికిప్పుడు టీకా బూస్టర్ డోసులు వేసుకోవాలని చెప్పడం సరికాదు. కొత్త వేరియంట్ ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావం నుంచి తప్పించుకుంటుందా లేదా అన్నది తేలకముందే.. మరో డోసు వేసుకోవడం మంచిది కాదు. (చదవండి: ఈ పక్షి భలే స్నానం చేస్తోంది ఎలాగో తెలుసా !!) -
‘డెల్టా’ డేంజర్ బెల్స్!
కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకారుల్లోకెల్లా ప్రమాదకారి అని నిరూపించే గణాంకాలు, అధ్యయనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచంలోని కోవిడ్ వైరస్ వేరియంట్లన్నింటిలోకి డెల్టా వేరియంట్ వేగవంతమైన, ప్రభావవంతమైనదని, టీకా తీసుకోని వారిలో ఈ వేరియంట్ ప్రభావం అధికమని తెలుసు! అయితే తాజాగా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి సైతం ఇన్ఫెక్షన్ కలిగించే సత్తా డెల్టాకు ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా టీకా తీసుకున్నా సరే డెల్టా సోకినవారు ఇతరులకు దీన్ని వ్యాప్తి చేయగలరని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టానే అని సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను ‘‘ఫిట్ అండ్ ఫాస్ట్’’గా అభివర్ణించారు. దీని దెబ్బకు టీకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో తిరిగి ఆంక్షలు విధించాల్సిన అవసరం వచ్చేలాఉందన్నారు. ఫైజర్ ప్రభావం అంతంత మాత్రమేనా? ఇప్పటివరకు కోవిడ్‌పై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదని భావిస్తున్న ఫైజర్ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్‌లో బయటపడ్డ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో డెల్టా వేరియంట్‌పై టీకాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయన్న నిపుణుల భయాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌లో డెల్టా వేరియంట్‌తో ఆస్పత్రిపాలైనవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారున్నారు. సింగపూర్‌లో సైతం ఇదే ధోరణి కనిపించింది. ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతంమంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో నూతన ఇన్ఫెక్షన్లలో 83 శాతం డెల్టా వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాలుండగా, ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా జోరు పెరిగిందని డబ్లు్యహెచ్‌ఓ హెచ్చరించింది. యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఈసీడీసీ)సైతం ఇదే హెచ్చరికలు చేసింది. ఈతరహా కొనసాగితే ప్రపంచమంతా డెల్టా ఆధిపత్యం వ్యాపించేందుకు వారాలు చాలని పేర్కొంది. ఇది ఇలాగే వ్యాపిస్తూ మరో కొత్త వేరియంట్‌గా మారితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసింది. ముక్కులో వైరస్ లోడు సాధారణ కోవిడ్ వేరియంట్లు సోకిన రోగి ముక్కులో ఉండే వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ సోకిన రోగి ముక్కులో వైరస్‌లోడు ఉంటుందని చైనాలో జరిపిన మరో అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమవుతోందని పీకాక్ విశ్లేషించారు. డెల్టా ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాక్సినేషన్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కానీ అసలు టీకా తీసుకోకుండా ఉండడం కన్నా ఏదో ఒక టీకా తీసుకోవడం చాలా బెటరని సూచిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
థర్డ్ వేవ్?.. ఆర్–వాల్యూ 1 దాటితే డేంజర్ బెల్స్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే థర్డ్ వేవ్ ఆందోళన మొదలైంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ రేటు ఆర్–నెంబర్ బాగా పెరిగిపోతూ ఉండడంతో థర్డ్ వేవ్ ముప్పు తప్పదేమోనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ ఆఖరి వారం వరకు ఆర్–నెంబర్ రేటు తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడంతో ఇన్నాళ్లూ ఇంటిపట్టునే ఉన్న జనం పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల బాట పట్టడంతో సంక్రమణ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏమిటీ ఆర్–నెంబర్ ఒక కోవిడ్ రోగి నుంచి ఎంత మందికి వైరస్ సంక్రమిస్తుందో ఆర్– నెంబర్ ద్వారా తెలుస్తుంది. మే 15 నాటికి ఆర్–నెంబర్ 0.78 నుంచి జూన్ 26 వచ్చేసరికి 0.88కి పెరిగిపోయిందని చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అధ్యయనం వెల్లడించింది. ఈ ఆర్–వాల్యూ 1 దాటితే కరోనా డేంజర్ బెల్స్ మోగినట్టుగానే భావించాలి. అప్పుడు కరోనా కేసులు మరింతగా వ్యాప్తి చెందుతాయి. మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సితాభ్ర సిన్హా చెప్పారు. ప్రతీ 100 మంది కోవిడ్ రోగుల నుంచి మేలో సగటున 78 మందికి వైరస్ సోకితే, అది ఇప్పుడు 88కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసులు తగ్గుదల నిలిచిపోయింది. కేరళ, మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మన దేశంలో కేరళ, మహారాష్ట్ర మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్–వాల్యూ ఒకటి కంటే తక్కువగానే ఉంది. కేరళలో ఈ ఆర్–వాల్యూ 1.1గా ఉంటే మహారాష్ట్రలో 1గా ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మూడో వంతు కేరళ నుంచే వస్తున్నాయి. 50శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి. కేరళలో 14 జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ రాష్ట్రం నుంచి ఒక్కో రోజు 15 వేల కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్, మేఘాలయా, మణిపూర్, మిజోరంలలో కేసుల్లో పెరుగుదల ఉంది. కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట గోవా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ’దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రతీ రోజూ 40 వేలు దాటి కేసులు రావడం చిన్న విషయం కాదు. ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసుల్ని చూసిన మనకి ఈ సంఖ్య చిన్నదిగా అనిపించవచ్చు. కానీ వరుసగా కొద్ది రోజుల పాటు 10వేలకు దిగువకి కేసులు వచ్చినప్పుడే మనం సురక్షితంగా ఉన్నట్టు. దీనికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. ’ –వి.కె.పాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ కన్వర్ యాత్ర సూపర్ స్ప్రెడర్గా మారనుందా? కరోనా రెండో వేవ్‌కి ముందు ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళాకి అనుమతినివ్వడం వివాదాస్పదమైంది. ఇప్పుడు అదే తప్పు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తోంది. కోవిడ్ హాట్ స్పాట్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ జూలై 25 నుంచి 15 రోజుల పాటు జరగనున్న కన్వర్ యాత్రకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అనుమతులిచ్చారు. కన్వర్ యాత్ర అంటే శివభక్తులు హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి పవిత్ర జలాల్ని కావడలతో మోసుకుంటూ వెళ్లి తమ స్వగ్రామాల్లో ఉండే శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా నుంచి కోట్లాది మంది హరిద్వార్‌కి వచ్చి గంగా జలాలను తీసుకువెళతారు. గతంలో ఈ యాత్రకి 2 నుంచి 5 కోట్ల మంది వరకు హాజరైనట్టుగా ఒక అంచనా. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కోట్లాది మంది భక్తులు ఈ యాత్రకి హాజరైతే ఆచరణలో నిబంధనలు పాటించడం అసాధ్యమని ఉత్తరాఖండ్ సామాజికవేత్త అనూప్ నౌటియాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కుంభమేళాకి 30 రోజుల్లో 70 లక్షల మంది హాజరైతే కన్వర్ యాత్ర జరిగే 15 రోజుల్లోనే 3 నుంచి 4 కోట్ల మంది వరకు హాజరు కావచ్చునని ఈ యాత్ర కరోనా వైరస్‌ని మరింతంగా వ్యాప్తి చేస్తుందని ఆందోళనలైతే ఉన్నాయి. తీర్థ సింగ రావత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ యాత్రని రద్దు చేస్తే ధామి అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారు. ఈ యాత్రని రద్దు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని, వారి ప్రాణాలకే భద్రత కల్పించడానికే తాము ప్రాధాన్యతనిస్తామని ధామి చెప్పుకొచ్చారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
కరోనా కల్లోలం: ఒక్కరోజే రెండు లక్షల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూలేని విధంగా 24 గంటల్లోనే ఏకంగా 2 లక్షలకుపైగా కేసులతో కొత్త రికార్డు నమోదయింది. యాక్టివ్ కేసులు కూడా 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. దేశంలో 24 గంటల్లోనే 2,00,739 కేసులు కొత్తగా నిర్థారణ అయ్యాయి. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైందని కేంద్రం తెలిపింది. మొత్తం రోజువారీ కేసుల్లో ఈ 10 రాష్ట్రాల్లోనివే 80.76% వరకు ఉన్నాయని వెల్లడించింది. 24 గంటల్లో మహారాష్ట్రలో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు వెలుగులోకి వచ్చాయి. వరసగా తొమ్మిదో రోజు కూడా లక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కేవలం 9 రోజుల్లోనే 13,88,515 కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 3 తర్వాత అత్యధికం 24 గంటల్లో 1,038 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. రోజువారీ మరణాల్లో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 278, ఛత్తీస్‌గఢ్‌లో 120, ఢిల్లీలో 104, గుజరాత్లో 73, ఉత్తరప్రదేశ్‌లో 67, పంజాబ్‌లో 63, మధ్యప్రదేశ్‌లో 51, కర్ణాటకలో 38, జార్ఖండ్‌లో 31 చొప్పున మరణాలు సంభవించాయని వివరించింది. 24 గంటల్లో మరో 93,528 మంది వ్యాధి నుంచి బయటపడగా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1,24,29,564 కాగా రికవరీ రేటు 88.31%కి, మరణాల రేటు 1.23%కి పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది. వీటితోపాటు, 36 రోజులుగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో గుర్తించిన 1,06,173 కేసులతో కలిపి 14,71,877కు చేరాయని, మొత్తం కేసుల్లో ఇవి 10.46% అని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, యూపీ, కేరళ రాష్ట్రాల్లోనివే 67.16% ఉన్నాయి. ఇప్పటి వరకు 26,20,03,415 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. కుంభమేళాలో 1,700 మందికి పాజిటివ్ హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు వచ్చే వారికి ఐదు రోజులుగా చేపడుతున్న కోవిడ్–19 పరీక్షల్లో 1,700మందికి పైగా పాజిటివ్‌గా నిర్థారణయింది. ఈ నెల 10–14 తేదీల మధ్య కుంభమేళాలో పాల్గొన్న భక్తులు, సాధువులు 2,36,751 మందికి ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరపగా 1,701 మందికి పాజిటివ్‌గా తేలింది. పూర్తి ఫలితాలు వెల్లడైతే పాజి టివ్ కేసులు 2వేల వరకు చేరే అవకాశం ఉందని హరిద్వార్ ప్రధాన వైద్యాధికారి శంభుకుమార్ ఝా వెల్లడించారు. కుంభమేళాలో∙48.51లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు అంచనాలున్నాయి. మే 15 వరకు చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు మూసివేత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది ఇందులో భాగంగా భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ ఆధీనంలో ఉండే చారిత్రక కట్టడాలతో పాటు మ్యూజియంలను మే 15 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ మూసి వేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఎన్.కె.పాఠక్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘టీకా ఉత్సవ్’లో 1,28,98,314 డోసులు దేశంలో అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 14వ తేదీ దాకా ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవ్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రంలో కోటికి పైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 11న 29.33 లక్షలు, 12న 40.04 లక్షలు, 13న 26.46 లక్షలు, 14న 33.13 లక్షల టీకా డోసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. టీకా ఉత్సవ్‌లో మొత్తం 1,28,98,314 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 1.11 కోట్లు, రాజస్తాన్‌లో 1.02 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 1.00 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. నాలుగు రోజులపాటు పని ప్రదేశాల్లోనే అర్హులకు టీకాలు అందజేసినట్లు గుర్తుచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో కోట్లాది మంది టీకాలు తీసుకున్నారని వివరించింది. -
కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాదఘంటికలు మోగిస్తూ ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. కరోనాని తరిమికొట్టడానికి అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటివరకు కరోనా కట్టడిలో అత్యంత ముఖ్యంగా భావిస్తున్న టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానంతో పాటు ప్రజలందరూ కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించడం, అంకితభావంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ అయిదు సూత్రాలతోనే కరోనా కొమ్ములు వంచగలమని ప్రధాని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్స్‌పల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోం, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు నీతిఅయోగ్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడానికి ప్రజలు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడమే కారణమని ఆ సమావేశం అభిప్రాయపడింది. ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, క్షేత్రస్థాయిలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి అరికట్టడంపై అధికారులు దృష్టి పెట్టకపోవడం కూడా కారణమేనని నిర్ణయానికొచ్చింది. అందుకే జిల్లా స్థాయిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట జోన్లు ఏర్పాటు చేసి కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది. దేశంలోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకి అవసరమయ్యే పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర చికిత్స సదుపాయాలపై కూడా ప్రధాని సమీక్షించినట్టుగా ఆ ప్రకటన వెల్లడించింది. మహారాష్ట, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర బృందాలు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 91శాతానికి పైగా కేసులు, మరణాలు 10 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానికి అధికారులు అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్ సమర్పించారు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. గత 14 రోజుల్లో 57% కేసులు ఈ రాష్ట్రాల నుంచే నమోదవగా, 47% మరణాలు సంభవించాయి. ఇక దేశవ్యాప్తంగా కేసుల్లో 4.5%, మరణాల్లో 16.3% పంజాబ్ రాష్ట్రం నుంచే రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 4.3% కేసులు, 7శాతానికి పైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటుగా కేసుల కంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు కేంద్ర బృందాలు వెళ్లి పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని ఆదేశించారు. కరోనా నిబంధనలపై అవగాహన కోవిడ్–19 నిబంధనల్ని పాటించడంలో ప్రజలకి అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో మాస్కుల వాడకం, వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో , పని ప్రాంతాల్లో శానిటైజ్ చేయడం తప్పనిసరి. వీటిపై ఏప్రిల్ 6 నుంచి 14 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాక్సినే ఆన్సర్ ఇక కరోనా పూర్తిగా నిర్వీర్యం కావాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రధాని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చెయ్యడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక టీకా తయారీ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. దేశీయ అవసరాలు తీరుస్తూనే ఇతర దేశాలకు టీకాలను పంపాలని ప్రధానమంత్రి అధికారుల్ని ఆదేశించారు. దేశంలో ఇప్పటివరకు 7.59 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో 43% మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లోనే ఇచ్చారు. ఒకే రోజు 93,249 కేసులు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకి ఎక్కువవుతోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి బెంబేలెత్తిస్తోంది. గత 24 గంటల్లో 93,249 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకుంది. మరోవైపు కరోనా మరణాలు 513 సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,64,623కి చేరుకుంది. 25 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపిస్తోంది. 6,91,597 మందికి ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో ఇది 5.54శాతంగా ఉంది. సెప్టెంబర్ మాదిరిగా.. గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా కరాళ నృత్యం చేసింది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోయి ఆందోళన నింపాయి. తొలిసారిగా గత ఏడాది సెప్టెంబర్ 5న రోజువారీ కేసుల్లో 90 వేల మార్క్‌ని దాటాము. సెప్టెంబర్ 5న 90,632 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 10న 97,735 కేసులు నమోదు కావడంతో రోజుకి లక్ష కేసులు వెలుగులోకి వస్తాయని అంచనా వేశారు. సెప్టెంబర్ 16న 97,894 కేసులు నమోదయ్యాయి. కానీ ఆ మర్నాడు 96,424 కేసులు వచ్చాయి. అప్పట్నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అక్టోబర్ చివరి నాటికి రోజువారీ కేసుల సంఖ్య 40వేలకి తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల గత ఏడాది సెప్టెంబర్‌ని గుర్తుకు తెచ్చేలా కేసుల్లో బీభత్సమైన పెరుగుదల కనిపిస్తోంది. మరొక వారం రోజుల్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. -
విద్యార్థుల వెన్నంటే కరోనా భయం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల తల్లిదండ్రులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు ఇంకా భయపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్ సదుపాయం కలిగిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీ బీవీ), గురుకుల పాఠశాలలకు పంపేందుకు ససే మిరా అంటున్నారు. స్కూళ్లు, హాస్టళ్లలో కరోనా వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధనకు మాత్రం గత్యం తరం లేని పరిస్థితుల్లో విద్యార్థులను (75–80%) స్కూళ్లకు పంపిస్తున్నారు. గత నెల 24 నుంచి ప్రారంభమైన 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థులు 50 శాతం కూడా ఉండట్లేదు. ఇక హాస్టల్ వసతి ఉన్న గురుకులాలు, కేజీబీ వీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతానికి మించట్లేదు. భయపెడుతున్న కేసులు.. ఇటీవల సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేజీబీవీలో 19 కేసులు నమోదు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు, టీచర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా బోథ్ గిరిజన ఆశ్రమ (బాలికల) పాఠశాలలో ఏడుగురికి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థినికి కరోనా సోకింది. వికారాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఇద్దరు టీచర్లకు కరోనా సోకింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలపూర్ జెడ్పీహెచ్ఎస్లో ఇద్దరు టీచర్లు, ఒక విద్యార్థికి కరోనా వచ్చింది. ధర్మపురి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. భద్రాద్రి కొత్తగూడెం మేదరబస్తిలో ఒక టీచర్‌కు, కరకగూడెం కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థినికి పాజిటివ్ వచ్చింది. ఇలా టీచర్లకు, విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఇదీ విద్యార్థుల హాజరు పరిస్థితి.. రాష్ట్రంలోని కేజీబీవీల్లో 6, 7, 8 తరగతులకు చెందిన బాలికలు 50,727 మంది ఉండగా, 13,065 మంది (25.75 శాతం) తల్లిదండ్రులను తమ పిల్లలను హాస్టళ్లకు పంపేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. అంగీకార పత్రాలు అందజేసిన వారంతా కూడా తమ పిల్లలను కేజీబీవీ హాస్టళ్లకు పంపట్లేదు. మొత్తం విద్యార్థుల్లో 9,695 మంది (19.11 శాతం) పిల్లలను మాత్రమే పంపిస్తున్నారు. 9, 10 తరగతుల బాలికలు కేజీబీవీల్లో 36,148 మంది ఉండగా, 30,231 మంది విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 28,524 మంది (78.91 శాతం) మాత్రమే స్కూళ్లకు వస్తున్నారు. 11, 12 తరగతుల (ఇంటర్మీడియట్) విద్యార్థులు కేజీబీవీల్లో 18,986 మంది ఉండగా, అందులో 14,667 మంది బాలికలను హాస్టళ్లకు పంపించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. వారిలో 12,954 మందిని (66.05 శాతం) కేజీబీవీలకు పంపించారు. రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 37 గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి. అందులో 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులు 8,216 మంది ఉండగా, 746 మంది (9.07 శాతం మంది) విద్యార్థులే గురుకులాలకు వచ్చారు. 9, 10, 11, 12వ తరగతి విద్యార్థులు మాత్రం 81 శాతం మంది హాస్టళ్లకు వచ్చినట్లు విద్యా శాఖ చెబుతోంది. 7,986 ప్రభుత్వ పాఠశాలల్లో 5,52,654 మంది 6, 7, 8 తరగతుల విద్యార్థులుంటే, 2,52,834 మంది (46 శాతం) విద్యార్థులు మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. 194 మోడల్ స్కూళ్లలో ఆయా తరగతుల విద్యార్థులు 49,035 మంది ఉండగా, అందులో 19,883 మంది (41 శాతం) మాత్రమే ప్రత్యక్ష బోధనకు హాజరవుతున్నారు. కేజీబీవీల్లో హాజరు పరిస్థితిదీ.. తరగతి మొత్తం విద్యార్థులు అంగీకారపత్రం ఇచ్చింది స్కూల్‌కు వస్తున్నది హాజరుశాతం 6 13,417 3,606 2,749 20.71 7 18,350 4,560 3,241 17.66 8 18,960 4,899 3,675 19.38 9 18,784 14,552 13,515 71.95 10 17,364 5,679 15,009 86.44 11 10,337 8,178 7,241 70.05 12 8,649 6,489 5,713 66.05 ఇవీ జిల్లాల వారీగా స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీల్లో నమోదైన పాజిటివ్ కేసులు.. జిల్లా మొత్తం కేసులు ప్రాంతం ఆదిలాబాద్ 7 బోథ్-6, ఆదిలాబాద్ -1 వరంగల్ అర్బన్ 2 కరీమాబాద్ జగిత్యాల 4 కోరుట్ల-3, ధర్మపురి- 1 సిరిసిల్ల 1 శివనగర్ భద్రాద్రి 2 మేదరబస్తీ-1, కరకగూడెం-1 సంగారెడ్డి 19 ఝరాసంఘం మంచిర్యాల 3 ములకల-1, గర్మిల్ల-2 నిర్మల్ 2 లక్ష్మణచాంద వికారాబాద్ 2 వికారాబాద్ -
ఢిల్లీలో డేంజర్ బెల్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. యూరోపియన్ దేశాల్లో కోవిడ్–19 సెకండ్ వేవ్ నడుస్తుండగా, ఢిల్లీలో మాత్రం థర్డ్ వేవ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో మరణాలు కూడా ఎక్కువ పెరిగాయి. చలిగాలులతో పాటు కాలుష్యం కారణంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ రాజస్తాన్‌ల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు వస్తున్న సమయంలోనైనా పంట వ్యర్థాల కాలుష్యాన్ని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ సర్కార్ విజ్ఞప్తి చేసింది. దేశ రాజధానిలో ఈ స్థాయిలో కరోనా విజృంభించడానికి కారణం గాలి కాలుష్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులు ఈ కలుషిత గాలిని పీల్చడంతో ఆరోగ్యం విషమించి, మరణాల రేటు పెరుగుతోంది. మార్చి నుంచి మే వరకు కరోనా కేసులు పెరిగినప్పటికీ, జూన్ నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, ఉత్తరాదిన చలి, కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తిని తగ్గించి, అనారోగ్యాన్ని పెంచే వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చేతులు దాటాక ఆస్పత్రికి.. హస్తినలో కోవిడ్ –19 కేసుల సంఖ్య పెరగడంతో, ఆసుపత్రుల్లో రోగులు గడిపే సమయం కూడా పెరిగింది. దీని కారణంగా దేశ రాజధానిలో కోవిడ్ పడకల కొరత పెరిగింది. అంతేగాక పాజిటివ్ నిర్ధారణ అయి, ఆక్సిజన్ స్థాయి తీవ్రంగా పడిపోయినప్పుడు మాత్రమే రోగులు ఆసుపత్రికి వస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురు తేజ్ బహదూర్ వైద్యులు తెలిపారు. అంతేగాక ఆసుపత్రిలో, కోవిడ్ రోగి బస చేసే సగటు వ్యవధి 10 రోజుల నుంచి మూడు వారాలకు పెరిగింది. జూన్–జూలై నెలల్లో మహమ్మారి సంక్రమణ సమయంలో ఒక్క రోజులో అత్యధిక మరణాలు (101) నమోదయ్యాయి. కానీ థర్డ్ వేవ్ ప్రారంభమైన తర్వాత, నవంబర్ 18న అత్యధికంగా ఒక్క రోజులో 131 మరణాలు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒకే రోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 8,593 గా నమోదైంది. పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత హోం క్వారంటైన్ అయిన రోగుల ఆరోగ్యం ఆక్సిజన్ స్థాయి నిర్ధారణలో ఆలస్యం కారణంగా విషమంగా మారుతోందని వైద్యులు తెలిపారు. ఇటువంటి కేసుల్లో 48–72 గంటల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. 57 లక్షల కరోనా సర్వేలో 13,516 మంది గుర్తింపు దేశ రాజధానిలో థర్డ్ వేవ్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం ఐదు రోజుల పాటు ఇంటింటికి తిరిగి భారీ సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించింది. ఢిల్లీలోని 11 జిల్లాల్లో ముగ్గురు సభ్యుల 9వేల బందాలు కోవిడ్ హాట్‌స్పాట్ సెంటర్లలో 57 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో రోగ లక్షణాలు ఉన్న 13,516 మందిని, వీరితో పరిచయం ఉన్న 8,413 మందిని గుర్తించారు. రోగ లక్షణాలు గుర్తించిన వారిలో అత్యధికంగా 3,796 మంది నైరుతి ఢిల్లీ జిల్లాలో ఉన్నారు. కట్టడికి కఠిన నిబంధనలు కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మాస్కు ధరించని వారికి వేసే జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000 కు పెంచింది. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 200 నుంచి 50కి కుదించింది. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో కోవిడ్–19 నిబంధనలను పాటించకపోతే మూసివేసేందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది. రెండు మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం విదితమే. భారత్‌లో రష్యా టీకా తయారీ రష్యాకు చెందిన సుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్‌ను ఇక భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. ఏడాదికి 10 కోట్లకు డోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని ఆర్డీఐఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను అంచనా వేయండి లండన్: ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా కోవిడ్–19 వ్యాక్సిన్ ఎంత వరకు పని చేస్తుందో అంచనా వేయాలంటూ యూకే ప్రభుత్వం వైద్య నియంత్రణ మండళ్లను కోరింది. ఈ మేరకు యూకే ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ లేఖ రాశారు. త్వరలోనే ఈ టీకా ప్రయోగాలు పూర్తి కావస్తూ ఉండడంతో ఈలోగా సామర్థ్యాన్ని అంచనా వేస్తే పంపిణీ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అస్ట్రాజెనెకా ఈ ఏడాది చివరి నాటికి 40 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేయనుంది. 2021 మార్చి నాటికి 4 కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. -
వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి
మాయదారి మహమ్మారి జన సమూహంలోకి చొచ్చుకొచ్చేసిందా?.. కరోనా వైరస్ ఇకపై ఎవరికి, ఎక్కడ, ఎలా సోకిందో గుర్తించడం కష్టమేనా?.. వచ్చే నాలుగైదు వారాలు గడ్డు కాలమేనా?.. కరోనా వైరస్ ఇక స్వైరవిహారం చేయనుందా?.. గురువారం వైద్యశాఖ ఉన్నతాధికారులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్ తీవ్ర రూపం దాల్చినట్టే కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా వైరస్ కమ్యూనిటీలోకి వెళ్లింది. ఎక్కడుందో, ఎలా సోకుతుందో పసిగట్టడం కష్టం. కంటికి కనిపించని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి. తక్షణమే గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం ద్వారానే కరోనా నుంచి బయట పడగలం. తీవ్రత పెరిగితే ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు’ అని వైద్యశాఖ సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య శాఖ చేపట్టిన చర్యలపై గురువారం కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఇందులోనూ దీర్ఘకాలిక సమస్యలతో చనిపోయే వారే అధికంగా ఉన్నా రన్నారు. కరోనా వైరస్‌కు భయపడవద్దని, జాగ్రత్తలు పాటించి సహజీవనం చేయడమొక్కటే మన ముందున్న మార్గమన్నారు. ఈ వైరస్ ప్రభావం ఎన్నిరోజులుంటుందో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను పెంచుతున్నామని, ఇటీవల రెండు లక్షల కిట్లు తెప్పించగా వాటితో పరీక్షలు చేశామని, మరో రెండు లక్షల కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ 3 సూత్రాలే శ్రీరామ రక్ష వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం.. ఇవి తప్పక ఆచరించాలన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉందని, దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, కొత్త జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా చికిత్సను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే అప్పుల పాలే.. బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని, లాక్డౌన్ నేపథ్యంలో మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటే అప్పుల పాలవుతారని డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రస్తుతం కరోనాకు ప్రత్యేక చికిత్స లేదని, లక్షణాలను బట్టి మందులు వేసుకోవాలని, ఇది చాలా సింపుల్ పద్ధతి అని అన్నారు. చిన్న లక్షణం కనిపించినా డాక్టర్ వద్దకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పుగా మారుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని, ప్రైవేటు ఆస్పత్రుల్లో 4,200 పడకలు ఉన్నాయని, మొత్తంగా 15 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. లక్షణాలు ఉన్న వారంతా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఈ మేరకు అన్ని పీహెచ్‌సీల్లో కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజూ సగటున 15 వేల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వీటిని 20–25 వేలకు పెంచుతామన్నారు. కరోనా బారిన వెయ్యి మంది వైద్య సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న దాదాపు వెయ్యికి పైగా వైద్య సిబ్బంది వైరస్ బారినపడ్డారని డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. కోర్టుల్లో గడియకో పిల్ వేస్తే ఎలా పనిచేస్తామని, ఇది మంచి పరిణామం కాదన్నారు. వైద్య సిబ్బందికి అన్ని వర్గాలు మద్దతు పలకాలని, కరోనా బాధితులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేదని, స్థానికంగానే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. బాధితుల్ని అవసరమైతే 108 అంబులెన్స్‌ల్లో నగరంలోని ఆస్పత్రులకు తరలించే బాధ్యత వైద్యాధికారులదేనని ఆయన చెప్పారు. ఇటు ‘సీజనల్’ దాడి.. అటు కరోనా పంజా కరోనా వైరస్‌తో కొత్త చిక్కొచ్చిపడింది. అసలే వర్షాకాలం.. జలుబు, వైరల్ జ్వరాలు పంజా విసిరే సమయం. ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్‌గా వచ్చే టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాలకు స్వైన్‌ఫ్లూ కూడా తోడైంది. సీజనల్ వ్యాధులకు..కరోనా వైరస్‌కు కామన్ సింప్టమ్ జ్వరమే. దీంతో ఎవరు ఏ జ్వరంతో బాధపడుతున్నారో గుర్తించడం కష్టం కానుంది. ఇప్పటికే గాంధీ సహా తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చింది. మున్ముందు కేసులు భారీగా పెరుగుతాయనే వైద్య ఆరోగ్యశాఖ అంచనాలతో ఇప్పటి వరకు టెస్టింగ్, ఐసోలేషన్ సెంటర్లుగా ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయి కోవిడ్ కేంద్రాలుగా మార్చుతున్నట్టు ప్రకటించడంతో ఆయా ఆస్పత్రుల్లో సాధారణ రోగులకు చికిత్సలు ప్రశ్నార్థకంగా మారాయి. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఇక్కడ మార్చి 2న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత వీటి సంఖ్య అనుహ్యంగా పెరిగింది. దీంతో జూన్‌లో 11,080 కేసులు, జూలైలోని 22 రోజుల్లోనే 21,443 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నగరంలో రోజుకు సగటున 800–1,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో 80 శాతం మందిలో లక్షణాలు కన్పించట్లేదని అంచనా. దీంతో తమకు తెలియకుండానే వీరు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్ను నిలిపివేసింది. ఆస్పత్రుల్లోని పడకల నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైరస్ నిర్ధారణ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తక్షణ నిర్ధారణతోనే మరణాలకు చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య విధాన పరిషత్ ద్వారా నిర్వహిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లకు బకాయిలన్నీ చెల్లించాలని, ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు మొదలు పెట్టాలని, శానిటేషన్, పేషెంట్ కేర్ ప్రొవైడర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్‌లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్ర కార్యాలయ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తెలిపారు. -
ఒక్క రోజులో దాదాపు 55వేల కేసులు
రియో డి జెనిరో: బ్రెజిల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 54,771 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 10,32,913కు చేరుకుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంతపెద్ద ఎత్తున కరోనా కేసులు బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. అమెరికా తర్వాత వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వాటిలో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. శుక్రవారం ఒక్క రోజే.. 1,206 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య బ్రెజిల్లో 48,954కు చేరింది. కాగా.. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 5,07,000 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం ప్రస్తుతం బ్రెజిల్ పరిస్థితి అమెరికా కంటే దారుణంగా తయారయ్యింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాను దాటేసి బ్రెజిల్ త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని అంచనా. కాగా.. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3,95,812 కరోనా కేసులతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. అయితే.. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 8.5 మిలియన్లకు పైగా కరోనా వైరస్ బారిన పడ్డారని.. 4,57,000 మందికి పైగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. చదవండి: 60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా.. -
మహా @ 30,000
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ముంబైతోపాటు మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మార్చి 9వ తేదీన దుబాయ్ నుంచి పుణేకు వచ్చిన దంపతుల ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించిన కరోనా వైరస్ రోజురోజుకూ తన విశ్వరూపం చూపిస్తోంది. మహారాష్ట్రలో గడిచిన ఎనిమిది రోజులను పరిశీలిస్తే ఒకటీ రెండూ కాదు ఏకంగా 10 వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 30 వేలను దాటింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన అనంతరం 16వ రోజు నాటికి 100గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య మరో 15 రోజుల్లో అంటే నెల రోజులు తిరగకుండానే 1,000కి చేరింది. 54 రోజుల్లో 10 వేల సంఖ్యను దాటింది. మొదటి 10 వేల కరోనా కేసులు నమోదు కావడానికి 54 రోజులు కాగా అనంతరం మరో 10 రోజుల్లోనే ఈ సంఖ్య 10 వేలు పెరిగింది. ఇలా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలను దాటింది. ఆతర్వాత ఈ సంఖ్య 30 వేలకు చేరడానికి కేవలం 8 రోజులే పట్టింది. 1,000 దాటిన మృతులు... రాష్ట్రంలో కరోనా ప్రవేశించిన వారం రోజుల్లోనే మార్చి 17వ తేదీన కరోనాతో ఓ వృద్ధుడు చనిపోయారు. అనంతరం నెల రోజుల్లోనే మృతుల సంఖ్య 50 దాటింది. మే 5వ తేదీ నాటికి 500ను దాటింది. ఈ నెల 16వ తేదీ వరకు 1,068 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు. సగానికి మించి ముంబైలోనే..: మహా రాష్ట్రలో బయట పడిన కరోనా కేసుల్లో సగానికి పైగా దేశ ఆర్థికరాజధాని ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే సుమారు 4వ వంతు కేసులు ఒక్క ముంబైలోనే బయటపడు తున్నాయి. ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలకు చేరువైంది. కొన్ని రోజులుగా సగటున ప్రతి రోజున ఏడు నుంచి ఎనిమిది వందలు పెరుగుతూ మే 16వ తేదీ నాటికి కరోనా బాధితుల సంఖ్య 18,555కు చేరింది. ముంబైలో మే 16వ తేదీ వరకు 696 మందిని కరోనా బలిగొంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నవీ ముంబై రైల్వే స్టేషన్ వద్ద యూపీ వలస కార్మికుల క్యూ -
కరోనా డేంజర్ బెల్స్
బీజింగ్ /న్యూఢిల్లీ: చైనాలోని వుహాన్‌లో బట్టబయలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతూ ఉంటే, చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో తొలి మరణం సంభవించింది. ఇక భారత్‌లోని కేరళలో రెండో కరోనా కేసు నమోదు కావడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 305 మంది మరణిస్తే, 15వేల మంది వరకు ఈ వైరస్ సోకింది. 25 దేశాలకు విస్తరించింది. వుహాన్ నుంచి∙ఫిలిప్పీన్స్‌కి వచ్చిన 44 ఏళ్ల చైనీయుడు ఈ వైరస్ కారణంగా మృతి చెందినట్టు ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చైనా పలు చర్యలు చేపట్టింది. కరోనా వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ యాత్రలపై నిషేధం విధించింది. శవాలను పూడ్చిపెట్టకుండా, వారు మృతి చెందిన ప్రాంతానికి సమీపంలో ఉన్న శ్మశాన వాటికల్లో దహనం చేయాలని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేరళలో రెండో కరోనా కేసు మన దేశంలోని కేరళలో మరో కరోనా కేసు నమోదైంది. ఇటీవల చైనా నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. అయితే పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. వుహాన్ యూనివర్సిటీ నుంచి కేరళకు వచ్చిన ఆ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు అనుమానం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ వెల్లడించారు. మరోవైపు వుహాన్ నుంచి మరో 323 మంది భారతీయులు, ఏడుగురు మాల్దీవుల వాసుల్ని భారత్‌కు తీసుకువచ్చారు. వీరిని ఆర్మీ, ఐటీబీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనాలో బర్డ్ ఫ్లూ భయం కరోనా వైరస్‌తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్‌కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్‌లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు. చైనా ప్రయాణికులకు భారత్ ఇ–వీసా రద్దు చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ–వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. -
డేంజర్ బెల్!
-
మానవ రక్తంలోనూ ‘ప్లాస్టిక్’ గంటలు!