భారత దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారా, లేదా ? నిషేధిస్తే ఏ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు ? ఎందుకు ? అసలు ప్లాస్టిక్‌లు ఎన్ని రకాలు, వాటిని ఎలా తయారు చేస్తారు ? అన్న విషయాల్లో ప్రజల్లో గందరగోళం నెలకొని ఉంది. దేశంలో ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్‌ను జాతిపతి మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిషేధించానుకున్నారు.