
సాక్షి, బెంగళూరు : నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర కర్ణాటకలోని జోగప్ప లేఅవుట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ...కూలీలు నిర్మాణపు పనుల్లో ఉండగా వాటర్ ట్యాంక్ ఫిల్లర్ హఠాత్తుగా కూలినట్లు తెలిపారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌టీ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. కర్ణాటక మంత్రి కృష్ణ బైరీ గౌడ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment