వాటర్ ట్యాంక్ ఢీకొని విద్యార్థి మృతి | student died in road accident | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్ ఢీకొని విద్యార్థి మృతి

Published Thu, Nov 26 2015 11:15 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

student died in road accident

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లి జాతీయరహదారిపై వాటర్ ట్యాంకు ఢీకొని రాజేష్(21) అనే విద్యార్థి మృతి చెందాడు. స్నేహితునితో కలిసి కొంపల్లిలోని సాయిచైతన్య కళాశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజేష్ బీకాం సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంతో సంఘటనాస్థలంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement