
సాక్షి, నంద్యాల: ఓ ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఆర్టీసీ డ్రైవర్ అల్లాబకాష్ కొంత కాలం క్రితం ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. మూడు రోజులుగా ఇంటిపైనున్న ట్యాంకు నుంచి నీరు సరిగా రాకపోవడంతో ఉదయం ఫ్లంబర్‌ను పిలిచి విషయం చెప్పాడు. అతడు మరమ్మతుల నిమిత్తం ట్యాంకు మూత తెరిచి చూడగా మృతదేహం కనిపించింది. (స్నేహితుని భార్యపై లైంగిక దాడి..)
సమాచారం పోలీసులకు చేరవేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు నాలుగు రోజుల క్రితం మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా, ఎవరైనా హత్య చేసి ట్యాంక్‌లో పడేశారా అనేది విచారణలో తేలనుందని సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం)
Comments
Please login to add a commentAdd a comment