కూకట్‌పల్లిలో దారుణం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. | Hyderabad: 4 Years Boy Dead After Under Construction Water Tank Wall Collapse Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో దారుణం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..

Published Tue, Apr 5 2022 12:07 PM | Last Updated on Tue, Apr 5 2022 12:42 PM

Hyderabad: 4 Years Boy Dead After Under Construction Water Tank Wall Collapse Kukatpally - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాతవాహననగర్‌లో నిర్మాణంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ గోడకూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారిలో నిర్మాణం జరుగుతున్న నీటి ట్యాంక్‌ గోడ శిథిలాలు కూలి చిన్నారి మీద పడ్డాయి.

ఈ ఘటనలో శరోన్‌ దీత్య(4)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లఎదుటే పాప మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement