వాటర్ ట్యాంక్ కూలి ఇద్దరి మృతి
Published Thu, Aug 24 2017 4:29 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
అహ్మదాబాద్: ఓ భవనం పై ఉన్న నీటి ట్యాంక్ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నారన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి శాస్ర్తినగర్‌లో ఓ మూడంతస్థుల భవనం పై ఉన్న 5 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ గురువారం నేల కూలింది. ఆ సమయంలో భవనం దగ్గరున్న ఐదుగురిపై వాటర్ ట్యాంక్ పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement