ట్యాంక్ నీళ్లు వాసన వస్తుండటంతో శుభ్రం చేద్దామని వెళ్లిన ఇంటి యజమానికి అందులో శవం కనిపించింది.
అల్లిపురం(విశాఖపట్టణం జిల్లా): ట్యాంక్ నీళ్లు వాసన వస్తుండటంతో శుభ్రం చేద్దామని వెళ్లిన ఇంటి యజమానికి అందులో శవం కనిపించింది. ఈ సంఘటన గురువారం విశాఖలోని అల్లిపురంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. అల్లిపురంలోని గణేష్ లాడ్జి వెనుక ఉన్న ఒక ఇంట్లో ట్యాంక్‌లో శవాన్ని గుర్తించిన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని ట్యాంక్‌లో నుంచి బయటకు తీశారు.
కాగా, మూడు రోజుల క్రితమే మృతదేహాన్ని ట్యాంక్‌లో వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు.. హత్యా? లేక ఆత్మహత్యా?.. అసలు ట్యాంకులోకి వ్యక్తి మృతదేహాం ఎలా వచ్చింది అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.