బాలుడి మృతికి కారణమైన నీటిగుంత గుడిసె శేషు (ఫైల్)
కర్నూలు ,ఆదోని టౌన్: నీటి కుంటలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆదోని పట్టణంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన తల్లిదండ్రులకు శోక సంద్రంలో ముంచింది. వివరాల్లోకి వెళితే.. ధనలక్ష్మి, రాజు దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు శేషు. వీరు అంబేడ్కర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఇంటి ఎదుట పిల్లలతో శేషు ఆడుకుంటూ పక్కనే ఉన్న నీటిగుంతలో పడ్డాడు. ఆలస్యంగా గమనించి బయటకు తీయగా అప్పటికే ప్రాణాలు విడిచి ఉన్నాడు. వచ్చీరాని చిన్నారి మాటలను గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తల్లి వద్దే ఉండింటే..
చిన్నారి శేషును తీసుకుని తల్లి ధనలక్ష్మి ఇటీవల రాయచూరులోని బంధవుల ఇంటికి వెళ్లింది. తండ్రి రాజు మూడు రోజుల క్రితమే కొడుకు శేషును ఆదోనిలోకి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తల్లి వద్దే ఉండింటే మనవడు బతికేవాడని అవ్వాతాతలు లక్ష్మీ, ఈరన్న, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, బంధవులు విలపించారు. బాలుడు మృతితో అంబేడ్కర్‌నగర్‌లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment