ఆదిలాబాద్(దండేపల్లి): ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించక పోవడంతో ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు న్యాయం చేయకపోతే కిందకు దూకుతా అని తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.