
యుగంధర్(ఫైల్) బాలుడు పడి మృతి చెందిన నీటి తొట్టె
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు యుగంధర్(4) నీటితొట్టెలో పడి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. యుగంధర్ సోమవారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు.
బాలుని కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గాజులమండ్యం పోలీసులను ఆశ్రయించారు. అయితే బుధవారం నీటితొట్టెలో నుంచి దుర్వాసన రావడంతో.. అనుమానం వచ్చి చూశారు. బాలుడు నీటితొట్టెలో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ముద్దులొలికే చిన్నారి విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.