కార్మికుల కోసం తాత్కాలికంగా నిర్మించబడిన ఓ నూతన వాటర్ ట్యాంక్ కుప్పకూలడంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.
అమేథి: కార్మికుల కోసం తాత్కాలికంగా నిర్మించబడిన ఓ నూతన వాటర్ ట్యాంక్ కుప్పకూలడంతో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో ముజాఫ్రిఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో పురె దలాయి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ దగ్గరలో పిల్లలు ఆడుకుంటుండగా ఆకస్మాత్తుగా ట్యాంక్ కూలిపోయినట్టు అమేథి ఎస్పీ హీరా లాల్ పేర్కొన్నారు. నాసిరకంగా నిర్మించడం వల్లే నీళ్ల తొట్టె కుప్పకూలిపోయినట్టు చెప్పారు.
మృతులు వినోద్ కుమార్ (15), రజని (4), రాగిని (7) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో బాలిక సంవాతి (8)ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. వాటర్ ట్యాంక్ యజమానిపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.