భార్య మాట వినటం లేదని భర్త హల్‌చల్‌  | Husband Climbed Water Tank Over Wife Not Listening To Him | Sakshi
Sakshi News home page

భార్య మాట వినటం లేదని భర్త హల్‌చల్‌ 

Published Wed, Jun 10 2020 10:10 AM | Last Updated on Wed, Jun 10 2020 10:30 AM

Husband Climbed Water Tank Over Wife Not Listening To Him - Sakshi

మద్యం మత్తులో వాటర్‌ ట్యాంక్‌పై కాశీరాం హల్‌చల్‌

నిజామాబాద్‌ : భార్య తన మాటలు లెక్క చేయటం లేదని భర్త తీవ్ర మనస్థాపం చెంది అదే కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్సై పాండేరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి గోసంగి కాలనీకి చెందిన చిత్తడి కాశీరాం, సాయమ్మ దంపతులు తరుచూ గొడవ పడేవారు. చిన్న గొడవ పెద్దదిగా మారి భర్త కాశీరాం మంగళవారం  మద్యం సేవించి భార్య తన మాట వినటం లేదని ఇంట్లోనే చనిపోతానని గొడవ పెట్టుకున్నాడు. అదే కోపంతో కాశీరాం బయటకు వచ్చి అక్కడే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి చనిపోతానని బెదిరించాడు. ట్యాంక్‌ దిగిరా నీ మాట వింటాను అని భార్య చెప్పిన భర్త వినలేదు. ( మహిళ ప్రాణం తీసిన‌ స్కార్ఫ్‌)

ట్యాంక్‌పైనే తిరుగుతూ చనిపోతానని బెదరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సీఐ ప్రసాద్, ఎస్సై పాండేరావు చేరుకున్నారు. మీ భార్య నీ మాట వినేలా చూస్తామని పోలీసులు చెప్పిన అతను ట్యాంక్‌ దిగలేడు. ఫైర్‌ ఇంజిన్‌ తెప్పించి పోలీసులు, యువకులు ట్యాంక్‌ ఎక్కి కాశీరాంను కిందకు దించి  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement