స్టీఫెన్ (ఫైల్) ప్రమాదానికి కారణమైన సంపు
మల్కాజిగిరి/గౌతంనగర్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.ఎస్‌ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి హిల్‌టాప్ కాలనీకి చెందిన సతీష్ ప్రైవేట్ ఉద్యోగి. అతనికి భార్య శశికళ, కుమారుడు స్టీఫెన్(2) ఉన్నారు. బుధవారం ఉదయం మంచినీళ్లు రావడంతో శశికళ ఇంటి ఆవరణంలో నీళ్లు పడుతుండగా స్టీఫెన్ పక్కింటి వద్ద ఆడుకుంటూ కనిపించాడు. కొద్ది సేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గాలింపు చేపట్టిది. పక్కింటి కాంపౌండ్‌లోని సంప్‌లో చిన్నారిని గురించిన ఆమె స్థానికుల సహాయంతో బయటికి తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని శశికళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సకాలంలో అందని వైద్యం..
గాంధీఆస్పత్రి : ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా జూడాల సమ్మె నేపథ్యంలో ఆస్పత్రి ప్రధాన గేటు మూసివేసి ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పడంతో పోలీసులు గేటు తెరిచారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా రెండ్రోజుల క్రితం అత్యవసర విభాగానికి వెళ్లే దారిని మూసివేసి, ఓపీ విభాగం మీదుగా దారి మళ్లించారు. ఓపీ విభాగం వద్ద జూడాలు ధర్నా చేస్తుండటం, దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో చిన్నారిని లోపలికి తీసుకు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. 15 నిమిషాలు ఆలస్యంగా చిన్నారిని అత్యవసర విభాగానికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాబు మృతి చెందినట్లు నిర్దారించారు. వైద్యసేవల్లో జాప్యం కారణంగా చిన్నారి తమకు దక్కలేదని ఆరోపిస్తూ మృతుని తల్లితండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment