ప్రభుత్వానిది పేదల పక్షం | government is favour to peoples | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానిది పేదల పక్షం

Dec 27 2014 1:26 AM | Updated on Jun 4 2019 5:04 PM

తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బీర్కూర్ : తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బరంగేడ్గిలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. మిర్జాపూర్‌లో పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వాటర్‌ట్యాంక్‌ను, దుర్కి గ్రామంలో మసీదు ఆవరణ లో నిర్మించిన దుకాణ సముదాయాలను ప్రారంభించారు.

ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన వారికి పింఛన్లు అందిస్తున్నామన్నా రు. ఇప్పటికే 90 శాతం మంది అర్హులకు పింఛన్లు అందించామన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజుల తర్వాత పింఛన్లు రాలేదని అర్హులు ఎవరైనా ఫిర్యా దు చేస్తే మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి వ్యక్తికి ఆరుకిలోల బియ్యం
కొత్త సంవత్సరం నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఆరు కిలలో చొప్పున బియ్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ఒకటో తేదీనుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
 
త్వరలో డబుల్‌బెడ్ రూం ఇల్లు..
మరికొద్ది రోజుల్లో పేదలకు రూ. 3.50 లక్షలతో డబుల్‌బెడ్ రూం ఇల్లు నిర్మించే ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు త్వరలోనే మహర్దశ రానుందన్నారు. బాన్సువాడ నుంచి బీర్కూర్ మీదుగ పొతంగల్ వరకు డబుల్ రోడ్డు కోసం రు. 28 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. నసురుల్లాబాద్‌నుంచి బీర్కూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రు. 10 కోట్లు మంజూరయ్యాయన్నారు. బరంగేడ్గి, చించోలి, బొప్పాస్‌పల్లి తదితర గ్రామాలకు గోదాంలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

ప్రతి ఇంటికి తాగునీరు..
వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పోచారం పేర్కొన్నారు. ఇందులో భాగంగా నిజాంసాగర్, పోచంపాడ్ ప్రాజెక్ట్‌ల నుంచి పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీర్కూర్ మండలానికి కొత్తగా 33 వాటర్ ట్యాంక్‌లు మంజూరయ్యాయన్నారు. బాన్సువాడలో వచ్చే విద్యాసంవత్సరానికల్లా కేజీ నుంచి పీజీ వరకు విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్ డీఈపై ఆగ్రహం
పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంపై మంత్రి ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వసంత్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. పనులు పూర్తయ్యాకే ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, ఎంపీపీ మల్లెల మీన, జడ్పీటీసీ సభ్యుడు నెనావత్ కిషన్ నాయక్, సర్పంచ్‌లు నాచారం అంజవ్వ, బుద్దె పోచవ్వ, ఏడె మోహన్, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, బుసాని ఇందిర, నాయకులు శ్రీనివాస్, సతీశ్, అశోక్, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement