వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్‌చల్ | Man to climb water tank | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్‌చల్

Published Wed, Jun 18 2014 1:28 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

వాటర్ ట్యాంకు ఎక్కి  యువకుడి హల్‌చల్ - Sakshi

వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్‌చల్

పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం మండలంలోని ఏరుగట్లలో చోటు చేసుకుంది.

 పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

 పెనుబల్లి : పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం మండలంలోని ఏరుగట్లలో చోటు చేసుకుంది. ఏరుగట్లకు చెందిన మహంకాళి రామకృష్ణపై మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కటారి రాముతో  కొందరు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ చికిత్స పొంది వారిపై వీఎం బంజర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కటారి రాము కూడా రామకృష్ణపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.

ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన వీఎం బంజర ఎస్సై పరుశురాం .. రామకృష్ణపై దాడికి పాల్పడిన రాముతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఇదే కేసు విషయంపై ఎస్సై పరుశురాం రెండు రోజుల క్రితం మహంకాళి రామకృష్ణ ఇంటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలని రామకృష్ణ తల్లిదండ్రులకు సూచించారు. ఈ క్రమంలో తనపై తప్పుడు కేసు నమోదు చేసి కొడతారేమోననే భయంతో రామకృష్ణ మంగళవారం ఉదయం ఏరుగట్లలోని ఆర్‌డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకు ఎక్కి హల్‌చల్ చేశాడు. ఎస్సై పరుశురాం నుంచి తనకు రక్షణ కల్పించాలని, ఉన్నతాధికారులు కల్పించుకునిన్యాయంచేయా లని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెది రించాడు.

సమాచారం అందుకున్న ఎస్సై పరుశురాంతోపాటు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నా రు. కిందికి రావాలని కోరినప్పటికీ రామకృష్ణ ఒప్పుకోలేదు.ఉన్నతాధికారులు వచ్చి తనపై పెట్టిన కేసు తీసి వేసి న్యాయం చేస్తానంటేనే వస్తానని, లేకుంటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని హెచ్చరిచాడు. దీంతో వీఎం బంజర సీనియర్ ఏఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారి పేరుతో అక్కడికి వచ్చి న్యాయం చేస్తానంటూ బాధితుడికి హా మీ ఇచ్చాడు. దీంతో కిందికి వచ్చిన రామకృష్ణ ఆయనతో మాట్లాడారు. ఎస్సై పరుశురాం తన ని, తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని, కేసు నమదు చేస్తానని బెదిరించాడని వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement