వాటర్ ట్యాంక్ కూలి యువతి మృతి | Woman dies in freak accident | Sakshi
Sakshi News home page

వాటర్ ట్యాంక్ కూలి యువతి మృతి

Published Sun, Oct 25 2015 11:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

Woman dies in freak accident

డుంబ్రిగూడ (విశాఖపట్నం) : నీళ్లు తేవడానికి ట్యాంక్ వద్దకు వెళ్లిన యువతి ట్యాంక్ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలంలోని అమలగూడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కుర్ర డాలిమ్మ(22) మంచి నీటి కోసం వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కూలిపోవడంతో గోడ మీద పడి యువతి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామస్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్యాంక్ శిథిలావస్థలో ఉందని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, దీని వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement