
సాక్షి, విజయవాడ : నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆటలాడుతున్నారు. ఉద్యోగాల భర్తీని పట్టించుకోకుండా వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నాలుగేళ్లుగా పశువైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్‌లను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆత్మహత్యలే దిక్కని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment