సాయి చరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వం కె.ఎల్.పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారం నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ ‘సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అన్న డైలామాలో ఉన్నాం. కానీ మా సినిమాకు 99 థియేటర్లు దొరికాయి. సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్ అయింది. రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇదంతా బాలకృష్ణగారి వల్లే సాధ్యమైంది. నందమూరి కుటుంబంతో సినిమా చేయాలనుకున్నా. తారకరత్నగారితో సినిమా అనుకున్నా. ఆయన మరణించడంతో కుదరలేదు. త్వరలో నందమూరి ఫ్యామిలీ హీరోలతో ఓ సినిమా చేస్తా’అని అన్నారు.
‘చిన్న సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు వస్తారు. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు’ అని ప్రసన్నకుమార్ అన్నారు. డిఓపి సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment