
పల్లవి, శ్రీరామ్
శ్రీరామ్, పల్లవి జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. లాగిన్ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ –‘‘ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ.
ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా రియలిస్టిక్ కథను సినిమాగా రూపొందిస్తున్నాం. షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగుతుంది. నెక్ట్స్ వీక్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది. మంచి కథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఉదయ్‌భాస్కర్ గౌడ్. శ్రీరామ్, పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, సంగీతం: మహి మదన్ యంయం, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహ నిర్మాత: వినయ్‌కుమార్ గౌడ్.
Comments
Please login to add a commentAdd a comment