MLA Sudheer Reddy
-
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..
సాక్షి,ఎర్రగుంట్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహమ్మద్‌పీర్ అనే యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మహమ్మద్‌పీర్ ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌లో కార్యాలయానికి బయలుదేరాడు.రైల్వే ఓవర్ బ్రిడ్జి పైన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో పడిపో యాడు. ఆ సమయంలో కేజీవీ పల్లె గ్రామానికి వెళతున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి చూసి కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. చేయి విరిగిపోవడంతో వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ప్రొద్దు టూరు ఆసుపత్రికి పంపించారు. -
అర్హులందరికీ పరిహారం
సాక్షి, కొండాపురం: గండికోట ప్రాజెక్టులో అర్హులైన ముంపు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అన్యాయం జరగకుండా చూడాలని జమ్మలమడుగు ఎమ్మేల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు జెడ్పి ఉన్నతపాఠశాల ఆవరణంలో ముంపుబాధితులతో ఆయన భేటీ అయ్యారు. ఎమ్మేల్యేతోపాటు ఆర్డీఓ నాగన్న, జిఎన్ఎస్ఎస్ ఈఈ రామంజనేయులు.. మండల తహశీల్దార్ మాధవ కృష్ణారెడ్డి హాజరయ్యారు. డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గండికోట జలాశయంలోకి ఈనెలాఖరులోపు నీరు విడుదల కానుందన్నారు. కరువు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాగు, తాగునీరు అవసరాలకోసం శ్రీశైలంనుంచి కృష్ణా జలాలను తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. వామికొండ, సర్వారాయసాగర్, మైలవరం, పైడిపాళెం ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసి గండికోట జలాశయంలో 20 టీఎంసీలనీటిని నిల్వ చేయబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే నిర్వాసితులకు రూ.10లక్షల పరిహారం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 2017 నుంచి ఇప్పటివరకు పేస్–2 గ్రామాలకు కనీసం పునరావాస స్థలాలు కేటాయించలేదన్నారు. పేస్–2 కిందయర్రగుడి, చామలూరు, తాళ్లప్రొద్దుటూరు గ్రామాల్లో చెక్కులు ఇవ్వకమునుపే ఆర్అండ్ఆర్ సెంటర్‌కు స్థలాలు చూసి ప్లాట్లలో లే ఆవుట్ ఎర్పాటుచేయాలని ఆదేశించారు. గండికోటలో 13 టీఎంసీలు నీరు నిల్వ చేరితే తాళ్ల ప్రొద్దుటూరులోని ఎస్సీ, బిస్సీ కాలనిల్లోకి నీరు చేరుతుందన్నారు. నిర్వాసితులందరు సహాకరించాలన్నారు. అందరికి న్యాయం జరిగేలా పరిహారం అందిస్తామన్నారు. ముంపునిర్వాసితులు తమ సమస్యలను వివరించార. ఈ నెల 16 వ తేదిన రెండో దశ గ్రామాలకు గెజిట్ లిస్ట్ విడుదల చేస్తామని ఆర్డీవో నాగన్న చెప్పారు. అందులో రాని వారు ఆర్జీ రూపంలో తెలిపితే అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఎస్. చిన్న అంకిరెడ్డి, జిల్లా యూత్‌ప్రధాన కార్యదర్శి ఆర్. హరినారాయణరెడ్డి, బోరునారాయణరెడ్డి, మండల కన్వీనర్ నిరంజన్‌రెడ్డి, యర్రగుడి లక్ష్మినారాయణరెడ్డి, తుంగ శివారెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, చింతరాజారెడ్డి, సత్యనారాయణరెడ్డి, అల్లం సత్యం,రామసుబ్బారెడ్డి, రహంతుల్ల, మునయ్య పాల్గొన్నారు. -
చంద్రబాబు బినామీ సీఎం రమేష్
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చంద్రబాబు బినామీ సీఎం రమేష్ నాయుడు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పాదయాత్ర సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఆయన మండలంలోని కోనంపేట నుంచి బయల్దేరారు. పాదయాత్ర లక్కిరెడ్డిపల్లె చేరుకోగానే మహిళలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. మండలంలోని మూడు రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చారు. గజమాలతో సుధీర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మర్రిచెట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ పాలన వచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన 20ఏళ్లపాటు కొనసాగాలని, వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలన అంతా దొంగలమయమన్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు బినామీగా పని చేస్తూ ఆయన ఆస్తులను కాపాడేందుకు బీజేపీలోకి జంప్ అయ్యారని విమర్శించారు. అధికారం లేకపోతే అరగంట కూడా ప్రతి పక్షంలో ఉండలేరన్నారు. ఇంకా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ క్షోభించక తప్పదన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఖాళీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో నిలిచిన కాలువల పనులను పూర్తి చేయించి సాగు నీటిని అందిస్తామన్నారు. వైఎస్ జగన్ సహకారంతో ఆరు నెలల్లోపు బ్రహ్మణి ఉక్కును ప్రారంభించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గండికోట ముంపు గ్రామాలలోని 7 గ్రామాలకు రూ.10లక్షలు పరిహారం అందజేస్తామన్నారు. జిల్లా వాసులు జగనన్నపై చూపిన అభిమానానికి వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. -
జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సుఖ సంతోషాలతో 20ఏళ్ల పాటు సాగాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశామలంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిడుజివ్వి గ్రామం నుంచి తిరుమలకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తొలుత ఆయన తల్లి మూలె లక్ష్మిదేవికి పాదాభివందనం చేశారు. పాదయాత్రలో రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్దన్‌రెడ్డి, వందలాది మంది నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలా జగన్ పాలన ఉంటుందన్నారు. జిల్లా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నారు. ఆర్థిక లోటు లేకుండా కష్టాలు రాకుండా రైతులకు మేలు జరగాలని, చెరువుల్లో నీరు నిండాలని ఆకాంక్షించారు. గండికోట నీటిని ఆరు మండలాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 210 కిలోమీటర్ల పాదయాత్ర నిడుజివ్వి నుంచి కదిరివారిపల్లె, వలసపల్లె, తుమ్మలపల్లి, పెద్దనపాడు, ఉరుటూరు వీయన్ పల్లె , వేంపల్లి, గండి , రాయచోటి, పీలేరు మీదుగా పాదయాత్ర 210 కిలోమీటర్లు సాగనుంది. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగిన మార్గంలో ఉన్న ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు చేశారు. సీఐ కొండారెడ్డి ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు మాజీ ఎంపీపీ మునిరాజరెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేంద్రనాథ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వై విశ్వభార్గవరెడ్డి, నాయకులు వెంకటశివారెడ్డి, కౌన్సిలర్లు డి.సూర్యనారాయణరెడ్డి, పద్మనాభయ్య, మల్లు గోపాల్‌రెడ్డి, డి గంగాక్రిష్ణారెడ్డి, జయరామక్రిష్ణారెడ్డి, హనుమంతురెడ్డి, ముద్దనూరు కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, ఎర్రంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ వరధారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రషీద్, కోకోకోల గౌస్ చిన్నషేట్, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, అబ్దుల్ గఫూర్, వలి తదితరులు పాల్గొన్నారు. -
క్యూట్ లవ్ స్టోరీ
శ్రీరామ్, పల్లవి జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. లాగిన్ మీడియా శ్రీధర్‌రెడ్డి ఆశీస్సులతో కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ –‘‘ప్రయోగాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్‌గారు నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా రియలిస్టిక్ కథను సినిమాగా రూపొందిస్తున్నాం. షూటింగ్ మొత్తం తెలంగాణలో జరుగుతుంది. నెక్ట్స్ వీక్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభించి, 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది. మంచి కథతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఉదయ్‌భాస్కర్ గౌడ్. శ్రీరామ్, పల్లవి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, సంగీతం: మహి మదన్ యంయం, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహ నిర్మాత: వినయ్‌కుమార్ గౌడ్. -
మంత్రి తలసాని కారును ఢీకొట్టిన లారీ
-
తలసానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
కీసర: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించనున్న మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కీసరలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రథమ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. శామీర్‌పేట జంక్షన్ వద్ద మంత్రి కాన్వాయ్‌తోసహా రింగ్‌రోడ్డు ఎక్కారు. నర్సంపల్లి – యాద్గార్పల్లి మధ్య ముఖం కడుక్కునేందుకు కారును పక్కకు ఆపమని మంత్రి చెప్పడంతో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపునకు తీసుకున్నాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ మంత్రి కారును ఢీకొంది. దీంతో మంత్రి కూర్చున్న కారు కొద్దిగా ముందుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు తలసానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం మాత్రం దెబ్బతిన్నది. అయితే వెనుక సీటులో కూర్చున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా మంత్రికారులోనే ఉన్నా, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి కారును ఢీకొట్టిన లారీని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించి, డ్రైవర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ సురేందర్‌గౌడ్ తెలిపారు. దేవుడి దయతోనే బయటపడ్డా: తలసాని సాక్షి, హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే లారీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ప్రమాద విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారని ఈ సందర్భంగా చెప్పారు. -
గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు
శామీర్‌పేట్: మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిండితున్న చెరువులు, కుంటలను పరిశీలించేందుకు ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్ పెద్ద చెరువు వద్ద తూమును పరిశీలించారు. సగానికి చేరుకున్న శామీర్‌పేట్ పెద్ద చెరువులో నీటిని పరిశీలించిన ఆయన మండలంలోని వర్షాల వల్ల ఎన్ని చెరువులు నిండాయి.. వాటి వివరాలు వరద నీటితో వస్తున్న సమస్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరయాంజాల్‌లోని చెన్నరాయుడుచెరువు అలుగులను సందర్శించి గంగమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, శామీర్‌పేట్, దేవరయాంజాల్ సర్పంచులు బత్తుల కిశోర్‌యాదవ్, శ్రీనివాస్‌ముదిరాజ్, మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, ఉప సర్పంచ్ నర్సింగ్, వార్డుసభ్యులు ప్రకాశ్, మహేశ్, రాజు, వీరారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'ఎమ్మెల్యే నుంచి రక్షించండి'
సుల్తాన్‌బజార్: పోలీసు కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ బెదిరిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని సోమవారం ఓ వ్యక్తి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడకు చెందిన దుర్గాప్రసాద్‌గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సదురు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలివీ.. 'జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడ పరిధిలో అక్రమలే అవుట్లు, నిర్మాణాలకు హెచ్ఎండీఎ అనుమతి లేకుండా గ్రామ పంచాయితీ అధికారులు అనుమతినివ్వడాన్ని ప్రశ్నించినట్లు ఫిర్యాదు దారుడు తెలిపారు. ఈ నిర్మాణాలపై రాష్ర్ట హైకోర్టు కూడా ప్రజా ప్రయోజన వాజ్యాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ జరిపే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్కసుతో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా పోలీసు కేసు పెట్టించి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఆధారాలతో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాను' అని తెలిపాడు. కాగా, దీనిపై హెచ్ఆర్సీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. -
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు
ఘట్కేసర్: తమ డిమాండ్ల పరిష్కారించాలని పారిశుద్ధ్య కార్మికులు మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది కార్మికులు మంగళవారం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో ఉన్న ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతనాలు పెంపు సహా తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. -
సుధీర్ రెడ్డిపై ఈసీకి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్దంగా ఓ మహిళకు రూ. 32,500 మంజూరు చేశారని తెలిపింది. ఆయనపై చర్య తీసుకోవాలని కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. సుధీర్ రెడ్డి, ఆయన భార్య కమలపై ఈనెల 15న కూడా వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది. సేవా కార్యక్రమాల పేరుతో ఆమె ఓటర్లకు గాలం వేస్తున్నారని ఆరోపించింది. గుజరాతీలు ఎక్కువగా నివసించే డైమండ్ కాలనీలో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని సుధీర్ రెడ్డి హామీయిచ్చారని తెలిపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వీరిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ కోరింది. -
విభజన బాధాకరం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎల్బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అందరిదీ అని చెప్పారు. పొమ్మనే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ కీలక అంశంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడితే కష్టనష్టాలు ప్రజలకే తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రకటనకు అందరూ అంగీకరించాలని సుధీర్ రెడ్డి కోరారు.