'ఎమ్మెల్యే నుంచి రక్షించండి' | man complaint against MLA sudheer reddy in HRC | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే నుంచి రక్షించండి'

Published Mon, May 2 2016 7:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

man complaint against MLA sudheer reddy in HRC

సుల్తాన్‌బజార్: పోలీసు కేసు పెట్టించి జైలుకు పంపిస్తానంటూ బెదిరిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని సోమవారం ఓ వ్యక్తి హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. రంగారెడ్డి జిల్లా దమ్మాయిగూడకు చెందిన దుర్గాప్రసాద్‌గౌడ్  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో సదురు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలివీ.. 'జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడ పరిధిలో అక్రమలే అవుట్‌లు, నిర్మాణాలకు హెచ్‌ఎండీఎ అనుమతి లేకుండా గ్రామ పంచాయితీ అధికారులు అనుమతినివ్వడాన్ని ప్రశ్నించినట్లు ఫిర్యాదు దారుడు తెలిపారు.

ఈ నిర్మాణాలపై రాష్ర్ట హైకోర్టు కూడా ప్రజా ప్రయోజన వాజ్యాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ జరిపే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్కసుతో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా పోలీసు కేసు పెట్టించి జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఆధారాలతో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాను' అని తెలిపాడు. కాగా, దీనిపై హెచ్‌ఆర్సీ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement