
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం.
చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్‌సేన్‌పై ఫైర్
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్‌ఆర్‌సీ స్వీకరించింది.
చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి
విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్‌సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment