భయం లేదు | 'Dare' is of interest | Sakshi
Sakshi News home page

భయం లేదు

Published Thu, Jul 27 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

భయం లేదు

భయం లేదు

‘‘డేర్‌’ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. నవీన్‌ కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించడంతో మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. పాటలు, ఫైట్స్‌ హైలైట్‌. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని దర్శకుడు కె.కృష్ణప్రసాద్‌ అన్నారు. నవీన్, పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ఎస్‌. కరణ్‌ రెడ్డి సమర్పణలో ఎస్‌. రామారావు నిర్మించిన సినిమా ‘డేర్‌’. జి.ఆర్‌. నరేన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ విడుదల చేసి, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీరశంకర్‌కు అందించారు. నిర్మాత ఎస్‌.రామారావు మాట్లాడుతూ– ‘‘కథానుగుణంగా సదా చంద్ర మంచి పాటలు రాశారు.

వాటికి నరేన్‌ తనదైన స్టైల్‌లో అందర్నీ ఆకట్టుకునేలా కంపోజ్‌ చేశారు. సినిమాకు పాటలు పెద్ద ఎస్సెట్‌’’ అన్నారు. ‘‘మా టీమ్‌ కష్టపడి, ఇష్టపడి పనిచేశాం. మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. విజువల్స్‌ బాగున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని డేర్‌గా చెప్పగలను’’ అన్నారు నవీన్‌. పల్లవి, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయివెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement