dare
-
ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏర్పడింది? ‘ఆపరేషన్ రాహత్’ ఘనత ఏమిటి?
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను సైతం లెక్క చేయక నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ, దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసే జవాన్ల త్యాగం ఎవరూ వెలకట్టలేనిది. భారత సైన్యానికున్న పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన 20 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ హయాంలో 1776లో కోల్‌కతాలో ఇండియన్ ఆర్మీ ఏర్పడింది. 2. సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి. ఇది సముద్ర మట్టానికి ఐదువేల మీటర్ల ఎత్తులో ఉంది. ఇది భారత సైన్యం ఆధీనంతో ఉంది. 3. హిమాలయాలలోని ద్రాస్, సురు నదుల మధ్య ఉన్న బెయిలీ వంతెన ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన. దీనిని 1982లో భారత సైన్యం నిర్మించింది. 4. అమెరికా, చైనాల తర్వాత భారత సైన్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనికబలగం. 5. ఇతర ప్రభుత్వ సంస్థలలో మాదిరిగా భారత సాయుధ దళాలలో కులం లేదా మతం ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ లేదు. 6. 2013లో ఉత్తరాఖండ్‌లో వరద బాధితులను రక్షించేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ రాహత్’ ప్రపంచంలోనే అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్. 7. ప్రెసిడెంట్స్ బోర్డ్గార్డ్ అనేది భారత సైన్యంలోని పురాతన సైనిక దళం. ఇది 1773లో స్థాపితమయ్యింది. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉంది. 8. ఎత్తయిన పర్వతప్రాంతాలలో యుద్ధాలకు భారతీయ సైనికులు సమర్థులైనవారిగా గుర్తింపుపొందారు. 9. 1971 డిసెంబర్లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారు. ఈ యుద్ధ నేపధ్యంతోనే బాలీవుడ్ సినిమా ‘బోర్డర్’ రూపొందింది. 10. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద వాలంటరీ ఆర్మీ. భారతఆర్మీ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. 11. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (హెచ్ఏడబ్ల్యుఎస్)ను భారత సైన్యం అత్యుత్తమ సైనిక శిక్షణ కోసం నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి ముందు అమెరికా, ఇంగ్లండ్, రష్యా ప్రత్యేక దళాలు ఇక్కడ శిక్షణ పొందాయి. 12. భారతదేశం 1970, 1990లో అణు పరీక్షలను నిర్వహించింది. 13. కేరళలోని ఎజిమల నావల్ అకాడమీ మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అకాడమీ. 14. భారత సైన్యంలో అశ్విక దళం కూడా ఉంది. ప్రపంచంలో ఇలాంటి రెజిమెంట్లు మూడు మాత్రమే ఉన్నాయి. 15. తజికిస్థాన్‌లో భారత వైమానిక దళానికి ఔట్-స్టేషన్ ఉంది. తజికిస్థాన్ తర్వాత, ఇప్పుడు భారత సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా తన అవుట్-స్టేషన్‌ను నిర్మించబోతోంది. 16. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ ఏజెన్సీలలో ఒకటి. ఇది భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. 17. 1971లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఏకంగా 93 వేల మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం చోటుచేసుకున్న అతిపెద్ద లొంగుబాటు ఇదే. 18. పలువురు ప్రముఖులకు సాయుధ దళాల గౌరవ ర్యాంక్‌లు ఇచ్చారు. సచిన్ టెండూల్కర్‌కు భారత వైమానిక దళం కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. ఎంఎస్ ధోనీకి భారత సైన్యం లెఫ్టినెంట్ హోదాను ప్రదానం చేసింది. 19. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో గల మోవ్ భారతదేశంలోని పురాతన కంటోన్మెంట్లలో ఒకటి. 1840 నుండి 1948 వరకు రెజిమెంట్ ఇక్కడ శిక్షణ పొందింది. 20. 1835లో స్థాపితమైన అస్సాం రైఫిల్స్.. భారత సైన్యంలోని పురాతన పారామిలిటరీ దళం. -
మాస్ మెచ్చేలా ఫైట్స్
నవీన్, పల్లవి జంటగా కె. కృష్ణప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేర్’. యన్. కరణ్‌రెడ్డి సమర్పణలో యన్. రామారావు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా యన్. కరణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకుల ఊహకందని సన్నివేశాలు చాలా ఉన్నాయి. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయి. నవీన్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. తను చేసిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలకు బాగా చేరువయ్యాయి. మా సినిమా తప్పకుండా ప్రేక్షలకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్, నిర్మాణం: యన్. వరలక్ష్మి. -
భయం లేదు
‘‘డేర్’ ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. నవీన్ కొత్త కుర్రాడైనా బాగా నటించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించడంతో మంచి అవుట్‌పుట్ వచ్చింది. పాటలు, ఫైట్స్ హైలైట్. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని దర్శకుడు కె.కృష్ణప్రసాద్ అన్నారు. నవీన్, పల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ఎస్. కరణ్ రెడ్డి సమర్పణలో ఎస్. రామారావు నిర్మించిన సినిమా ‘డేర్’. జి.ఆర్. నరేన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ విడుదల చేసి, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్‌కు అందించారు. నిర్మాత ఎస్.రామారావు మాట్లాడుతూ– ‘‘కథానుగుణంగా సదా చంద్ర మంచి పాటలు రాశారు. వాటికి నరేన్ తనదైన స్టైల్లో అందర్నీ ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. సినిమాకు పాటలు పెద్ద ఎస్సెట్’’ అన్నారు. ‘‘మా టీమ్ కష్టపడి, ఇష్టపడి పనిచేశాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుందని డేర్‌గా చెప్పగలను’’ అన్నారు నవీన్. పల్లవి, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకట్. -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
లవ్..యాక్షన్..కామెడీ
కె.కృష్ణప్రసాద్ దర్శకత్వంలో ఎన్.ఆర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డేర్’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నరేన్ సంగీత దర్శకుడు. నవీన్ హీరో. జీవ, మధు, పల్లవి, సుహాసిని ఇతర ముఖ్య తారాగణం. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నరేన్ మంచి సంగీతం అందించారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాఘవ, పాటలు: సదాచంద్ర. -
రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీడీపీ దొంగలు
ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్లండి ప్రారంభించిన వాటికే మళ్లీ ప్రారంభోత్సవాలా? రైతు వ్యవసాయం వదిలేస్తే దేశం ఏమైపోతుంది వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి ధ్వజం తణుకుః ఇసుక, మట్టిని య«థేచ్ఛగా దోపిడీ చేస్తూ రైతుల నుంచి ధాన్యం కమిషన్ రూపంలో రూ. కోట్లు దండుకుంటూ రాష్ట్రాన్ని టీడీపీ దొంగలు దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం తణుకులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడప గడపకూ వైఎస్సార్ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగితే టిడిపి నాయకులను దొంగల్లాగ చూస్తున్నారని విమర్శించారు. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉంటూ ప్రతి ఇంటికీ తాము వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉంటే జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాలు, వార్డుల్లో తిరుగుతున్నామంటూ ఎవరికి సమాధానం చెబుతున్నారని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు కట్టవద్దని ఎన్నికలకు ముందు ఇంటింటికీ వచ్చి బొట్టు పెట్టి మరీ చెప్పారని ఇప్పుడు అడిగితే ముఖం చాటేస్తున్నారంటూ మహిళలు వాపోతున్నారన్నారు. తాము ఒక గ్రామంలో వారం పైబడి తిరుగుతుంటే జనచైతన్య యాత్రలంటూ రోజుకు రెండు గ్రామాలు, రెండు వార్డుల్లో పర్యటిస్తుండం ఎంత వరకు సమంజసమన్నారు. ఇలా తిరుగుతూ ఎవరింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రాచరిక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానిస్తే పార్టీనాయకులు మాత్రం తమ నాయకుడి మాటలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారన్నారు. అయితే ఇప్పుడు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వ్యవసాయం వేస్ట్... పరిశ్రమలు బెస్ట్... అంటూ వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. రైతులు కాడి వదిలేస్తే దేశం ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి ప్రారంభోత్సవాలా..? తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 1.44 కోట్లు మునిసిపల్ సాధారణ నిధులు వెచ్చించి నిర్మాణం చేపట్టిన స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ స్టేడియంను గతంలోనే ప్రారంభిస్తే ఇప్పుడు తామేదో ఘనకార్యం చేసినట్లు మరోసారి ప్రారంభోత్సవం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలతో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎంపీ చిట్టూరి సుబ్బారావు చౌదరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో అప్పట్లోనే కౌన్సిల్ తీర్మానం చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా మహాత్మాజ్యోతిరావు పూలే పేరుతో బీసీ కమ్యూనిటీ హాలు నిర్మిస్తే టిడిపి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భవనం కింద పేరు మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రస్తుతం రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారన్నారు. ఇంట్లో పెళ్లి జరిగితే రూ. 2.50 లక్షల వరకు వెసులుబాటు ఉందని చెబుతున్నా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు. నోట్లు రద్దు నేను రాసిన లేఖ వల్లనే ప్రధానమంత్రి చేశారని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రకటనలు చేయడాన్ని ఆక్షేపించారు. బహిరంగ సమావేశాలకు డ్వాక్రా మహిళలను తరలించే నాయకులు వారి అడిగిన ప్రశ్నలకు మాత్రం బదులివ్వకుండా తప్పించుకుంటున్నారన్నారు. మహిళలను నిర్భంధించి మరీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లులో జిల్లాలో రూ. 48 కోట్లు అవినీతి జరిగిందని సాక్షాత్తూ జిల్లా జడ్పీ ఛైర్మన్ పేర్కొంటూ విచారణ చేయాలని డిమాండ్ చేయడం టిడిపి నాయకుల అనివీతికి నిదర్శనమన్నారు. ఈ పరిస్థితుల్లో దొంగలు ఎవరు..? మీ పార్టీ నాయకులా... మా పార్టీ నాయకులా... అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ములగాల శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాస్, నామకులు నార్గన సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, బూసి వినీత, బోడపాటి వీర్రాజు, కర్రి కాశీరెడ్డి, వి.సీతారాం, దాసి రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు. -
పూరీలో ప్రధాని మోదీ సాహసం..
పూరీ: ఒడిశా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సాహసకృత్యం ఆయనకు భద్రతా బలగాలకు ముచ్చెమటలు పట్టించింది. ప్రఖ్యాత జన్నాథ ఆలయ సందర్శన కోసం ఆదివారం ఉదయం పూరీ పట్టనానికి వచ్చిన మోదీ.. హెలికాప్టర్ దిగి కారు ఎక్కి ఆలయంవైపునకు కదిలారు. అయితే హెలిపాడ్ వద్ద తనను చూసేందుకు పెద్ద ఎత్తున గుమ్మిగిన జనాన్ని గమనించిన మోదీ.. వారిని నిరాశపర్చకూడదనే అభిప్రాయంతో కాన్వాయ్ ని ఆపేయించి, కారు డోరు తీసుకుని ఫుట్ రెస్ట్ పై నిలబడిమరీ అభివాదం చేశారు. దేశంలోనే అత్యంత పటిష్ట భద్రత కలిగిన వ్యక్తిగా నరేంద్ర మోదీ అలా కారు డోరు తెరుచుకుని నిలబడటం, అందునా అది తీవ్రవాద ప్రభావిత రాష్ట్రం కావడంతో భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆయన చుట్టూ కంచెలా మారిపోయారు. 'సాహసం చేస్తేచేశారుగానీ ఆయన దర్శనంతో పులకించి పోయాం' అంటూ సంతోషం వ్యక్తం చేశారు హెలీప్యాడ్ కు వచ్చిన ప్రజలు. -
దమ్ముంటే నన్ను జైలులో పెట్టండి..
'ప్రజల తరఫున మాట్లాడితే నోటీసులు పంపారు. ఒకటికాదు.. రెండుకాదు.. అలాంటి నోటీసులు వంద పంపినా భయపడను. ఇదే గడ్డమీద నిలబడి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి. కటకటాల్లోకి నెట్టినా నేనెప్పుడూ ప్రజల గొంతుకనే వినిపిస్తా..' అంటూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీలో ఆదివారం పర్యటించిన ఆమె.. స్థానిక బీజేపీ శ్రేణులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాహుల్ గాంధీకి చెందిన స్వచ్ఛంద సంస్థ భూ కబ్జాలకు పాల్పడిందంటూ గతంలో స్మృతి చేసిన విమర్శలపై మండిపడ్డ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్మృతి ఇరానీకి లీగల్ నోటీసులు పంపడం తెలిసిందే. ఆదివారం నాటి ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి దేనికీ తాను భయపడబోనన్నారు.