
పల్లవి, నవీన్ (ఫైల్)
కర్ణాటక, కృష్ణరాజపురం : భర్తతో కలిసి ఏడు అడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి ప్రవేశించి ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన నవ వధువు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. ఈ ఘటన గురువారం కోణనకుంటెలో చోటు చేసుకుంది.కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన పల్లవి(24)కి నవీన్ అనే వ్యక్తితో నెలన్నర క్రితం వివాహమైంది. నవీన్ బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్యతో కలిసి కోణనకుంటెలో నివాసం ఉంటున్నాడు. దంపతుల మధ్య ఏం జరిగిందో ఏమో కాని పల్లవి గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని పల్లవి మృతదేహాన్ని పరిశీలించారు. నవీన్ వేధింపులు తాళలేకే పల్లవి ఆత్మహత్య చేసుకుందని కోణనకుంటె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment