యంగ్‌ హీరో నిఖిల్‌పై రూమర్స్.. అవన్నీ ఫేక్..! | Nikhil Siddharth Shuts Down Divorce Rumours Shares Pic With Wife Pallavi | Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: యంగ్‌ హీరో నిఖిల్‌పై రూమర్స్.. అవన్నీ ఫేక్..!

Published Fri, Nov 18 2022 4:05 PM | Last Updated on Fri, Nov 18 2022 7:41 PM

Nikhil Siddharth Shuts Down Divorce Rumours Shares Pic With Wife Pallavi - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌పై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టాలీవుడ్ హీరో తన భార్య పల్లవితో విడిపోతున్నట్లు కొద్దికాలంగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడిపోయేందుకు నిఖిల్‌ సిద్ధమయ్యాడని అసత్య ప్రచారం నడుస్తోంది. ఇటీవలే కార్తికేయ-2తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు నిఖిల్.

 ప్రస్తుతం తన భార్య పల్లవితో గోవాలో వెకేషన్‌లో ఉన్నారు యంగ్ హీరో. గోవాలో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. 'మనిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే' అంటూ ఓ ఫోటోను షేర్‌ చేశారు. కాగా 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్‌ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement