పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌.. | Nikhil Siddhartha Postpones His Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..

Published Tue, Apr 7 2020 5:19 PM | Last Updated on Sun, May 3 2020 3:22 PM

Nikhil Siddhartha Postpones His Marriage - Sakshi

కరోనా కారణంగా మరో టాలీవుడ్‌ హీరో పెళ్లి వాయిదా పడింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్టు హీరో నితిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో నిఖిల్‌ కూడా తన పెళ్లిని వాయిదా వేసకుంటున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజుల క్రితం తన పెళ్లిని ఎవరూ ఆపలేరని నిఖిల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసుకోవడమే మంచిదని నిఖిల్‌ భావించినట్టుగా తెలుస్తోంది. 

‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవడం సాధ్యపడేలా కనిపించడం లేదు. వేరే మార్గం లేక మేము మా పెళ్లిని వాయిదా వేసకుంటున్నాం. అయితే ఈ పరిస్థితులు ఇంకా ఎంత కాలం కొనసాగుతాయో తెలియడం లేదు. పెళ్లి వాయిదా పడినందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొద్దిగా నిరాశ చెందారు. కానీ భద్రత అనేది అనింటి కంటే ముఖ్యమైనది. మనం కష్టాల్లో ఉన్న సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైనది కాదు’ అని నిఖిల్‌ తెలిపారు.

కాగా, ఫిబ్రవరి 1 వ తేదీన డాక్టర్‌ పల్లవి వర్మతో నిఖిల్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, పల్లవిలు పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యారు. ఏప్రిల్‌ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. 

చదవండి : కరోనా ఎఫెక్ట్‌: అభిమానులకు నితిన్‌ విజ్ఞప్తి 

డాక్టర్‌తో హీరో నిఖిల్‌ నిశ్చితార్థం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement