బాలుడిపై సామూహిక అత్యాచారం | Boy Molestation In TDP Party Office In Kurnool | Sakshi
Sakshi News home page

దారుణం : బాలుడిపై సామూహిక అత్యాచారం

Published Thu, Jan 30 2020 10:34 AM | Last Updated on Thu, Jan 30 2020 2:30 PM

Boy Molestation In TDP Party Office In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా అవుకు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. బాలుడిని డిన్నర్‌ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అవుకు పట్టణానికి చెందిన ఒక బాలుడు (14) వారం క్రితం ఒంటరిగా ఆడుకుంటుండగా డిన్నర్‌ పేరుతో నలుగురు యువకులు టీడీపీ కార్యాలయంలోకి బలవంతంగా తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతన్ని బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ అబ్బాయి లైంగిక దాడికి గురయ్యాడన్న విషయం తెలుసుకున్న బాలుని తల్లిదండ్రులు అవుకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన వారిలో బుల్లెట్‌ రాజు, ప్రేమ్‌ కుమార్‌, రాజుతో పాటు మరొకరు ఉన్నట్లు, వీరంతా టీడీపీ కార్యకర్తలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సెక్షన్‌ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వీరిపై గతంలోనే పలు రౌడీషీట్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement