
సాక్షి, కర్నూలు: దేవనకొండ మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక(15)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత నోట్లో గడ్డి మందు పోసి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆ బాలిక బనవాసి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం వేరుశనగ పంటను తెంచేందుకు పొలానికి వెళ్లారు.
బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి పక్కన ఉండే ఓ బాలుడు గమనించి గట్టిగా అరిచాడు. దీంతో ఆ యువకులు అమ్మాయి నోట్లో గడ్డి మందును పోసి.. ఇంటి వెనకవైపు నుంచి పరారయ్యారు. తల్లిదండ్రులు ఇంటికొచ్చిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించి వెంటనే కోడుమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. (ప్రాణభయంతో కేకలు.. ఆరుగుర్ని కాపాడిన ఎస్‌ఐ)
Comments
Please login to add a commentAdd a comment