అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు
కర్నూలు: స్థానిక రాఘవేంద్రనగర్‌కు చెందిన యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. తన తండ్రి మిస్కినివలి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వెతికేందు కోసం బాధిత యువతి చాకలి ఎల్లన్న సాయం కోరింది. దీంతో అతడు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నగర శివారులోని కార్భైడ్ ఫ్యాక్టరీ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి డిసెంబరు 11వ తేదీన అత్యాచారం జరిపాడు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యువతి బయపడి కొంతకాలంగా మౌనంగా ఉండిపోయింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 10వ తేదీన తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితులు చాకలి ఎల్లన్న, చాకలి శివకళాధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.