న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ దేశీయంగా తయారు చేసిన (మేడిన్ ఇండియా) పవర్ బ్యాంక్‌లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందుకోసం హిపద్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మూడో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది.
10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ, 20,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐల ను ఈ యూనిట్‌లోనే తయారు చేయనుంది. వీటి ధరలు వరుసగా రూ.799గా, రూ.1,499గా ఉండనున్నాయి. కొత్త తయారీ యూనిట్‌లో నిమిషానికి ఏడు పవర్ బ్యాంక్‌లను తయారు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ యూనిట్ వల్ల తొలిగా దాదాపు 500 మందికిపైగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment