న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు జాక్‌పాట్ కొట్టింది. చైనాకు చెందిన ప్రముఖ క్రీడా పరికరా ల తయారీ సంస్థ లీ నింగ్‌తో నాలుగేళ్ల కాలానికి ప్రచారకర్తగా రూ.50కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు లో రూ.40కోట్లు స్పాన్సర్‌షిప్‌కు కాగా, మిగిలిన సొమ్ము సింధుకు అవసరమైన క్రీడాసౌకర్యాల కోసం ఇస్తారు. కాగా, గత నెలలో మరో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో సైతం ఇదే కంపెనీ రూ.35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సింధుకు ఇవ్వజూపిన సొమ్ము ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే భారీ మొత్తంగా భారత్‌లో లీ నింగ్ సంస్థకు భాగస్వామి, సన్‌లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కపూర్ తెలిపాడు. ఇది ప్యూమా సంస్థతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లీ (ఎనిమిదేళ్ల కాలానికి రూ.100కోట్లు) చేసుకున్న ఒప్పందానికి ఇంచుమించు సమాన మొత్తమని పేర్కొన్నాడు. లీనింగ్‌తో సింధు ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment