సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్‌ | South Korean great Lee Hyun Il roped in as PV Sindhu's consulting coach | Sakshi
Sakshi News home page

సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్‌

Published Wed, Sep 25 2024 7:34 AM | Last Updated on Wed, Sep 25 2024 7:34 AM

South Korean great Lee Hyun Il roped in as PV Sindhu's consulting coach

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్‌ ఓపెన్, డెన్మార్క్‌ ఓపెన్‌లతో పాటు ఆ తర్వాత యూరోప్‌ సర్క్యూట్‌లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్‌ ఇల్‌ను కన్సలి్టంగ్‌ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్‌ శ్రీధర్‌ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది.

 ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే చైనా ప్లేయర్‌ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్‌ ఓపెన్‌ గెలిచిన తర్వాత మరే టైటిల్‌ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్‌ సంగ్‌ కాంట్రాక్‌ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్‌’ కోచ్‌ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్‌ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది.

దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్‌ పడుకోన్‌ వద్ద పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్‌ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్‌ సాంటోసో కాంట్రాక్ట్‌ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్‌ చివరి వరకు సింధుకు కొత్త కోచ్‌ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్‌తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్‌ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. 

‘నా కెరీర్‌ కీలక దశలో అనూప్, లీ హ్యూన్‌లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది.  

మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ లీ హ్యూన్‌ 
అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్‌ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్‌ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్‌ పలికిన 
అనంతరం అతను కోచింగ్‌ వైపు మారాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement