
హైదరాబాద్: ప్రముఖ శీతలపానీయాల కంపెనీ పెప్సీ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా రుతు ప్రభును నియమించుకుంది. ‘రైజ్ అప్, బేబీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం గురించి పెప్సీ కోలా లీడ్ సౌమ్యా రాథోర్ మాట్లాడుతూ.. ‘‘పెప్సీ ఎప్పుడూ కూడా యువతరాన్ని ప్రతిబింబించేలా కృషి చేస్తుంది.
మా తాజా ప్రచారంలో భారత మహిళల సాధికారతపై దృష్టి ఉంటుంది. వారి అచంచలమైన ఆత్మవిశ్వాసం, నమ్మకానికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది’’అని పేర్కొన్నారు. మహిళలు సమాజం కల్పించిన మూస ధోరణిని వీడి, తమ హృదయాలనే అనుసరించాలనేది తాను పూర్తిగా నమ్ముతానని సమంతా రుతు ప్రభు పేర్కొన్నారు. మహిళల స్ఫూర్తిని చూపించే పెప్సీ ప్రచారం తనకు ప్రత్యేకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment