
Disney Hotstar Brand Ambassador: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన చెర్రి ఆ తర్వాత నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటనలో, డ్యాన్స్‌లో తండ్రిని తగ్గ తనయుడిగా అనిపించుకుంటున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన చెర్రి నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నాడు. అటూ హీరోగా ఇటూ నిర్మాతగా దూసుకుపోతున్న రామ్ చరణ్ ఇప్పుడు సరికొత్తగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు వెర్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు తెలుస్తోంది. రెండు ప్రకటనలతో పాటు ప్రింట్ యాడ్స్‌లో చేసేందుకు రామ్ చరణ్ రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్.
చదవండి: మరో కాస్ట్‌లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్
ఇందుకు సదరు సంస్థ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందంపై హాట్‌స్టార్ చెర్రి గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్ విడుదల ఉండటంతో తమ మార్కేట్‌ను పెంచుకునే దిశగా చెర్రిని తమ బ్రాండ్ అంబాసిడర్ చేసుకోవాలని హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. దీంతో రామ్ చరణ్ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేయడంపై డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఆనందం వ్యకం చేస్తోందట. కాగా త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమవుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంతో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను జరపుకోనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది.