IRCTC Online Ticket Booking Process Changed: Check New Rules Details - Sakshi
Sakshi News home page

IRCTC Online Ticket Booking: ఐఆర్‌సీటీసీ అలర్ట్‌.. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు, ఏంటంటే..

Published Wed, May 11 2022 9:31 PM | Last Updated on Thu, May 12 2022 10:56 AM

IRCTC Online Ticket Booking Process Changed Check Details - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ లేదంటే యాప్‌ని ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం.. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్‌సీటీసీ.. బుధవారం ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.  ఈ యాప్‌ అప్లికేషన్ గూగుల్‌ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్‌ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుందన్నది తెలిసిందే. ఇక మీదట.. వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది.

అయితే  COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 

ఫోన్ నంబర్ , ఈ-మెయిల్‌ ఐడీని ఎలా ధృవీకరించవచ్చో చూద్దాం..
ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్‌ విండో కనిపిస్తుంది.

► అందులో మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేయాలి.

► కుడి వైపు వెరిఫికేషన్‌.. ఎడమ వైపు ఎడిట్‌ బటన్‌ కనిపిస్తాయి.

► వివరాలను పొందుపరిచాక.. వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) మొబైల్‌ నెంబర్‌ లేదంటే మెయిల్‌ ఐడీకి వస్తుంది.

► ఆపై వెరిఫై ద్వారా ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 

వెరిఫికేషన్‌ తర్వాత.. 
ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ లేదా యాప్‌కు వెళ్లి లాగిన్‌ కావాలి. స్టేషన్‌, తేదీ, ఇతర వివరాలను ఎంటర్‌ చేయాలి. బుక్‌ నౌ మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి.  పేమెంట్‌ ఆప్షన్‌ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్‌ వివరాలు వస్తాయి.

చదవండి: గూగుల్‌లో ఈ మూడు విషయాలు సెర్చ్‌ చేయొద్దు.. చేస్తే జైలుకెళ్లడం ఖాయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement