
30 నిమిషాల ముందు రైలు టికెట్ బుకింగ్
న్యూఢిల్లీ: రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అమల్లోకి తేనుంది. నవంబర్ 12 నుంచి ఇది అమల్లోకి రానుంది. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తించనుంది.
దీంతో..ఇప్పటి వరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వే ఇక రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు.