
సాక్షి, హైదరాబాద్: కేరళ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మౌర్య రాఘవ్(ఖమ్మం), శరణ్ శ్రావణ్(వరంగల్) క్షేమంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయ అధికారులు తెలిపారు. వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం విద్యార్థినులు, కొట్టాయం కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థినులకు రైలు టికెట్లు బుక్ చేశామని, వారు సోమవారం తెలంగాణకు బయల్దేరుతారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment