మనం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ శాతం రైల్వే టికెట్ బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటాము. అయితే, ఏదైనా కారణాల వల్ల టికెట్ రద్దు చేస్తే మనం బుక్ చేసిన డబ్బులో చాలా వరకు కట్ కావడమే కాకుండా చాలా రోజులకు గాని, ఆ నగదు మన ఖాతాలో జమ కాదు. అయితే, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. ఇంతకు ముందు వరకు ఐఆర్‌సీటిసీకి స్వంతంగా పేమెంట్ గేట్ వే లేదు.
అయితే, ఇప్పుడు ఐ-పే రూపంలో కొత్తగా స్వంత పేమెంట్ గేట్-వేను తీసుకొని వచ్చింది. ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది.(చదవండి: టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట)
ఐపే సర్వీస్ అంటే ఏమిటి?
ఐపే సర్వీస్ పేరుతో ఐఆర్‌సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. దీని ద్వారా, ప్రజలు టిక్కెట్లను త్వరగా బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సీటిసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసే సమయంలో కొత్త పేమెంట్ గేట్ వే "ఐ-పే" సేవలను ప్రవేశపెట్టింది.
ఐఆర్‌సీటిసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతకు ముందు టికెట్ రద్దు చేసినప్పుడు రీఫండ్ కోసం ఎక్కువ సమయం పట్టేది, కానీ ఇప్పుడు మీ డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అవుతుంది. యూజర్ తన యుపీఐ బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు ఆ తర్వాత తదుపరి లావాదేవీలు చేసటప్పుడు ఆటోమెటిక్ గా వివరాలు కనిపిస్తాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. (చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!)
ఐఆర్‌సీటిసీ స్వంత పేమెంట్ గేట్ వే
ఐఆర్‌సీటిసీ ప్రకారం ఇంతకుముందు కంపెనీకి దాని స్వంత పేమెంట్ గేట్ వే లేదు, కానీ ఇప్పుడు ఐ-పే రూపంలో వచ్చింది. తరచుగా ప్రజలు గూగుల్ పే, రేజర్ పే, పేటిఎమ్ వంటి ఇతర చెల్లింపు గేట్ వేలను ఉపయోగించాల్సి వచ్చేది. దీనికి ద్వారా టికెట్ బుక్ చేసటప్పుడు ఎక్కువ సమయం పట్టేది, అలాగే నగదు రీఫండ్ కూడా చాలా ఆలస్యంగా జరిగేది. కానీ, ఇక నుంచి ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది.
ఐఆర్‌సీటిసీ ఐపేతో టిక్కెట్ ఎలా బుక్ చేయాలి?
- మొదట www.irctc.co.in లాగిన్ అవ్వండి.
- మీ ప్రయాణ వివరాలు సమర్పించి టికెట్ బుకింగ్ చేసేటప్పుడు పేమెంట్ కోసం 'ఐఆర్‌సీటిసీ ఐపే' ఆప్షన్ ఎంచుకోండి.
- డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యుపీఐ మొదలైన వాటి ద్వారా పేమెంట్ చేయండి.
- ఆ తర్వాత వెంటనే మీ టిక్కెట్ బుక్ అవుతుంది. అలాగే మీకు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ కూడా టిక్కెట్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment