ticket booking online
-
రైల్వే టికెట్ రద్దు చేస్తే ఇక క్షణాల్లో ఖాతాలో డబ్బులు జమ
మనం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ శాతం రైల్వే టికెట్ బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటాము. అయితే, ఏదైనా కారణాల వల్ల టికెట్ రద్దు చేస్తే మనం బుక్ చేసిన డబ్బులో చాలా వరకు కట్ కావడమే కాకుండా చాలా రోజులకు గాని, ఆ నగదు మన ఖాతాలో జమ కాదు. అయితే, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఐఆర్సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. ఇంతకు ముందు వరకు ఐఆర్సీటిసీకి స్వంతంగా పేమెంట్ గేట్ వే లేదు. అయితే, ఇప్పుడు ఐ-పే రూపంలో కొత్తగా స్వంత పేమెంట్ గేట్-వేను తీసుకొని వచ్చింది. ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది.(చదవండి: టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట) ఐపే సర్వీస్ అంటే ఏమిటి? ఐపే సర్వీస్ పేరుతో ఐఆర్సీటిసీ కొత్త సేవలను ప్రారంభించింది. దీని ద్వారా, ప్రజలు టిక్కెట్లను త్వరగా బుక్ చేయవచ్చు. అలాగే, టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐఆర్సీటిసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసే సమయంలో కొత్త పేమెంట్ గేట్ వే "ఐ-పే" సేవలను ప్రవేశపెట్టింది. ఐఆర్సీటిసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతకు ముందు టికెట్ రద్దు చేసినప్పుడు రీఫండ్ కోసం ఎక్కువ సమయం పట్టేది, కానీ ఇప్పుడు మీ డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అవుతుంది. యూజర్ తన యుపీఐ బ్యాంక్ అకౌంట్ లేదా డెబిట్ కార్డు వివరాలు నమోదు చేస్తే చాలు ఆ తర్వాత తదుపరి లావాదేవీలు చేసటప్పుడు ఆటోమెటిక్ గా వివరాలు కనిపిస్తాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. (చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) ఐఆర్సీటిసీ స్వంత పేమెంట్ గేట్ వే ఐఆర్సీటిసీ ప్రకారం ఇంతకుముందు కంపెనీకి దాని స్వంత పేమెంట్ గేట్ వే లేదు, కానీ ఇప్పుడు ఐ-పే రూపంలో వచ్చింది. తరచుగా ప్రజలు గూగుల్ పే, రేజర్ పే, పేటిఎమ్ వంటి ఇతర చెల్లింపు గేట్ వేలను ఉపయోగించాల్సి వచ్చేది. దీనికి ద్వారా టికెట్ బుక్ చేసటప్పుడు ఎక్కువ సమయం పట్టేది, అలాగే నగదు రీఫండ్ కూడా చాలా ఆలస్యంగా జరిగేది. కానీ, ఇక నుంచి ఒకవేల మీరు గనుక టికెట్ బుక్ చేసే సమయంలో ఐ-పే ద్వారా బుక్ చేస్తే మీకు త్వరగా టికెట్ బుక్ కావడమే కాకుండా టికెట్ రద్దు చాలా తక్కువ సమయంలో నగదు రీఫండ్ అవుతుంది. ఐఆర్సీటిసీ ఐపేతో టిక్కెట్ ఎలా బుక్ చేయాలి? మొదట www.irctc.co.in లాగిన్ అవ్వండి. మీ ప్రయాణ వివరాలు సమర్పించి టికెట్ బుకింగ్ చేసేటప్పుడు పేమెంట్ కోసం 'ఐఆర్సీటిసీ ఐపే' ఆప్షన్ ఎంచుకోండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యుపీఐ మొదలైన వాటి ద్వారా పేమెంట్ చేయండి. ఆ తర్వాత వెంటనే మీ టిక్కెట్ బుక్ అవుతుంది. అలాగే మీకు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ కూడా టిక్కెట్ వస్తుంది. -
వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది. బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు. -
మొబైల్ నుంచీ జనరల్ టికెట్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్ ద్వారా సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటు లోకి తెచ్చింది. సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకూ విస్తరించారు. ఇందుకోసం అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి మూడు గంటల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 554 రైల్వేస్టేషన్లలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు జనరల్ క్లాస్ టికెట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. దశలవారీగా సమీప రైల్వేజోన్లకు.. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎంజీ శేఖరం, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన యూటీఎస్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి బయలుదేరే రైళ్లలో యూటీఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే సేవల డిజిటైజేషన్లో దక్షిణ మధ్య రైల్వే మొదటి నుంచి ముందు వరుసలో ఉందని, 80 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం ఏర్పాటు చేశామని, త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని జీఎం చెప్పారు. యూటీఎస్ సేవలు ఇలా.. పండుగలు, వరుస సెలవుల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సాధారణ తరగతి టికెట్ల కోసం ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లే వరకూ టికెట్ లభించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో యూటీఎస్ యాప్ ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని రైలు ఎక్కొచ్చు. యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు బయలుదేరే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉండాలి. ఆ రోజు బయలుదేరే రైళ్ల(కరెంట్ బుకింగ్)లో మాత్రమే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 3 గంటల పాటు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఆ వ్యవధిలో బయలుదేరకుండా ఉంటే టికెట్ డబ్బులు నష్టపోవాలి. సాధారణ రైళ్లతో పాటు సబర్బన్ రైళ్లలో టికెట్లూ బుక్ చేసుకోవచ్చు. సీజనల్ టికెట్లు(నెలవారీ/3 నెలల పాస్‌లు) పొందవచ్చు. రెన్యువల్ చేసుకొవచ్చు. రైల్వే స్టేషన్లలోకి రెండు గంటల పాటు అనుమతించే ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా ఈ యాప్ ద్వారా లభిస్తాయి. యూటీఎస్ యాప్ ద్వారా ఒకేసారి నలుగురికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు రకాల టికెట్లు.. యూటీఎస్ యాప్ బుకింగ్స్‌లో రెండు రకాల టికెట్ ఆప్షన్లు ఉన్నాయి. పేపర్‌లెస్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్ టికెట్ కావాలనుకుంటే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బుకింగ్ కౌంటర్లలో తమ మొబైల్ నంబర్, టికెట్ బుకింగ్ కోడ్ చెబితే ప్రింటెడ్ టికెట్ ఇస్తారు. స్టేషన్లలోని ఏటీవీఎంల నుంచీ పేపర్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్‌లెస్ టికెట్లను మొబైల్లో భద్రపరుచుకుని టికెట్ ఎగ్జామినర్లకు చూపిస్తే సరిపోతుంది. పేపర్‌లెస్ టికెట్లకు ఏ రోజుకు ఆ రోజు రంగు మారిపోతుంది. టిక్కెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆర్–వాలెట్‌పై 5 శాతం రాయితీ.. ప్రయాణికులు ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ స్మార్ట్ఫోన్లలోని ప్లేస్టోర్ల నుంచి ‘యూటీఎస్’యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పేరు, మొబైల్ నంబర్, ఆధార్ తదితర వివరాలు నమోదు చేయాలి. దాంతో యూటీఎస్ యాప్ నుంచి టికెట్ బుకింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ యాప్‌లో రైల్వే వాలెట్ (ఆర్–వాలెట్) కూడా ఉంటుంది. ఆర్–వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేస్తే 5 శాతం రాయితీ లభిస్తుంది. పేటీఎం, పేమెంట్ గేట్‌వే, నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లోనూ టికెట్ల డబ్బులు చెల్లించవచ్చు. యాప్‌ను ఆవిష్కరిస్తున్న జీఎం వినోద్ -
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
♦ ఆగస్టు 12వ తేదీ నుంచి 23 వరకు ♦ ఆన్లైన్లో టిక్కెట్ల బుకింగ్ ♦ హైదరాబాద్ జోన్ ఆర్టీసి ఈడీ వేణు తాండూరు: కృష్ణ పుష్కరాల కోసం 1,100 ప్రత్యేక బస్సులు నడపునున్నట్టు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డి.వేణు వెల్లడించారు. తాండూరు ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్ జిల్లాలనుంచి 200, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి 900 బస్సులను పుష్కరాలకు నడపనున్నట్టు వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిని బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అయితే పుష్కర ఘాట్ల వరకు చేరుస్తాయని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బీచ్పల్లి, రంగాపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లి, సోమశిలలోని పుష్కర ఘాట్లకు బస్సులు తీసుకెళ్తాయి. విజయవాడ వరకు 50 బస్సులు వేశారు. ఏసీ, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ తదితర బస్సుల్లో ప్రయాణించేందుకు ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. 50మంది ప్రయాణికులు కలిసి వస్తే వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు అదనపు చార్జీలు ఉంటాయని, ఎంత అనేది త్వరలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.