train ticket issue
-
టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..
పండగ సీజన్లో రైళ్లు కిక్కిరిసిపోవడం గమనిస్తాం. దాంతో చాలామంది ప్రయాణికులు ముందుగానే రైలు టికెట్ బుక్ చేసుకుంటూంటారు. అయితే చివరి నిమిషం వరకు టికెట్ బుక్ అవ్వకపోతే కొన్ని ఛార్జీల రూపంలో రైల్వే విభాగం కొంత డబ్బులు కట్ చేసుకుని మిగతా నగదును సంబంధిత ప్రయాణికుడి ఖాతాలో జమ చేస్తోంది. దీనిపై ప్రశ్నిస్తూ ఇటీవల ఎక్స్ వేదికగా వెలిసిన పోస్ట్ వైరల్‌గా మారింది.అన్సారీ అనే ప్రయాణికుడు చేసిన పోస్ట్ ప్రకారం..‘నేను ఢిల్లీ నుంచి ప్రయారాజ్ వెళ్లాలనుకున్నాను. అందుకోసం రైల్వే టికెట్ బుక్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌ను బుక్ చేశాను. కానీ నా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఫైనల్ చార్ట్ కూడా ప్రిపేర్ అయింది. అయితే నేను ముందుగా చెల్లించిన టికెట్ ధరలో రూ.100 కట్ అయి మిగతా నా ఖాతాలో జమైంది. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా రూ.100 ఎందుకు కట్ చేశారో చెప్పగలరా?’ అంటూ ఇండియన్ రైల్వే మినిస్ట్రీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను తన ఎక్స్ ఖాతాలో ట్యాగ్ చేశారు.Dear @RailMinIndia @AshwiniVaishnaw I booked a waitlisted ticket from Delhi to Prayagraj, but it didn’t get confirmed after the chart was prepared. Could you explain why 100 rupees were deducted from the refund instead of receiving the full amount#IRCTC #railway pic.twitter.com/L3UzYoq67P— SameerKhan (@SameerK95044261) October 29, 2024ప్రతి ప్యాసింజర్‌కు ఇదే నియమంఐఆర్సీటీసీ విభాగం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌పై స్పందించింది. ‘భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్‌కు సంబంధించి క్లర్కేజ్ ఛార్జీల కింద ప్రతి ప్యాసింజర్‌కు రూ.60 చొప్పున కట్ అవుతుంది. దీనిపై అదనంగా జీఎస్టీ ఉంటుంది’ అని తెలియజేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కాకుండా చాలామంది థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా టికెట్లు బుక్ చేస్తున్నారు. దాంతో టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే యాప్ కూడా అదనంగా ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.As per Indian Railway rules in case of waitlisted/RAC ticket clerkage charges Rs. 60/- along with GST per passenger shall be levied Please follow the given link: https://t.co/0Mek9yKVW3— IRCTC (@IRCTCofficial) October 29, 2024ఇదీ చదవండి: 60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా..> టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ప్రయాణం వాయిదా వేయాలనుకుని టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం వివిధ తరగతులకు విభిన్నంగా ఛార్జీలు వర్తిస్తాయి. అయితే ప్రయాణానికి 48 గంటల మందే క్యాన్సిల్ చేస్తే కింది ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్/ ఎగ్జిక్యూటివ్: రూ.240 + GSTఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్: రూ.200 + GSTఏసీ చైర్ కార్/ ఏసీ 3 టైర్/ఏసీ 3 ఎకానమీ: రూ.180 + GSTస్లీపర్: రూ.120సెకండ్ క్లాస్: రూ.60> ట్రెయిన్ బయలుదేరే 48 నుంచి 12 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేయాలంటే ఛార్జీలో 25 శాతం, జీఎస్టీ భరించాల్సిందే.> ప్రయాణానికి 12 నుంచి 4 గంటలలోపు అయితే ఛార్జీలో 50 శాతం, జీఎస్టీ విధిస్తారు. -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
నేను ఆ తప్పు చేయలేదు!
టికెట్ చూపించమని అడిగినందుకు రైల్వే సెక్యూరిటీ గార్డుపై దాడిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్వీర్ సంధూ తాజాగా కోర్టు విచారణకు హాజరయింది. సెంట్రల్ లండన్‌కు సమీపంలోని స్లౌఘ్ పట్టణంలో నివాసముంటున్న ఆమె తాను ఏ తప్పు చేయలేదని, ఆత్మరక్షణ కోసమే సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నానని రీడింగ్ క్రౌన్ కోర్టుకు వాంగ్మూలమిచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 7న స్లౌఘ్ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ గార్డు, టికెట్ కండక్టర్‌తో దురుసుగా వ్యవహరించి జాతివివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసినట్టు సంధూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. టికెట్ చూపించాలని అడిగినందుకు 'కోతి' అని దూషించి నానా దుర్భాషలాడినట్టు ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. టికెట్ లేదని ఆమెను సెక్యూరిటీ గార్డు నిలిపివేయడంతో ఈ గొడవ జరిగింది. అయితే, 25 ఏళ్ల సంధూ వద్ద సీజన్ టికెట్ ఉన్నట్టు తర్వాత సెక్యూరిటీ గార్డు, కండక్టర్ గుర్తించారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో తమపై సంధూ చేయిచేసుకున్నదని, నానా దుర్భాషలాడుతూ, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ రభస సృష్టించిందని సెక్యూరిటీ గార్డు బ్రాండన్ థాంప్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, తనపై అతడు చేసిన అభియోగాలను సంధూ పూర్తిగా తిరస్కరించింది. తాను అతనిని ఉద్దేశించి జాతివివక్ష వ్యాఖ్యలు చేయలేదని, అతడే తనపై దాడికి దిగాడని, దీంతో ఆత్మరక్షణ కోసమే చేయి చేసుకున్నానని స్పష్టం చేసింది. తనపై సెక్యూరిటీ గార్డు దాడి చేశాడని, ఈ కేసులో తానే బాధితురాలనంటూ మొదట సంధునే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇరువర్గాలవారి తరఫు లాయర్ల వాదనలు విన్న క్రౌన్ కోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.