rail ticket
-
నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!
భారత రైల్వే టికెటింగ్ సేవలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కో ఆపరేషన్ (ఐఆర్సీటీసీ)కి చెందిన ఈ-టికెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. అధికారిక వెబ్సైట్, యాప్ సేవలను దాదాపు గంటసేపు నిలిపేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది.‘వెబ్సైట్ నిర్వహణ పనుల వల్ల అధికారిక వెబ్సైట్, యాప్‌లు నిలిచిపోయాయి. ఈ-టికెట్ సేవలకు మరో గంటపాటు అంతరాయం కలుగుతుంది. టికెట్లకు సంబంధించి ఏదైనా పరిష్కారాల కోసం తర్వాత ప్రయత్నించండి. మరేదైనా సమస్యల కోసం etickets@irctc.co.inకు మెయిల్ చేయండి. ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 0755-6610661, 0755-4090600కు సంప్రదించండి’ అని ఐఆర్సీటీసీ తెలిపింది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు The Most Pathetic Service from @IRCTCofficial , When Can we expect an Improvement? are we so incompetent that cant handle the traffic on the #irctc app and website. when talking about the development but the foundation is very weak which is your server which is down all d time. pic.twitter.com/VpxRw8GemC— Chintan Raval (@ChintanRaval1) December 9, 2024స్టేటస్ ట్రాకింగ్ సాధనం డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఐఆర్సీటీసీ వినియోగదారులు వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు 50 శాతం వెబ్సైట్ వినియోగదారులు సైట్, యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. దాంతో చాలామంది వినియోగదారులు విభిన్న సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. -
మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి ఇది చల్లటి కబురే. రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. (ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!) ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) -
త్వరలో రైల్వే టికెట్లపై డిస్కౌంట్లు!
న్యూఢిల్లీ: విమానాలు, హోటళ్ల తరహాలోనే త్వరలో సీట్లు భర్తీకాని రైళ్లలో టికెట్ ధరలో డిస్కౌంట్ అందజేస్తామని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్.. డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. భర్తీకాని రైళ్లలో టికెట్లను డిస్కౌంట్ ధరలకు అందించడంపై రైల్వేబోర్డు చైర్మన్ అశ్వినీ లోహానీ అనుభవం తమకు ఉపయోగపడుతుందన్నారు. పండుగ సీజన్లలో, వారాంతాల్లో, రద్దీ తక్కువగా ఉండేకాలంలో టికెట్ ధరల్ని సవరించేందుకు ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. మహిళల భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీటీవీలను అమర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
ఇక రైల్ టికెట్ తీసుకోవడం ఈజీ : డీఆర్ఎం
కృష్ణా(విజయవాడ): రైల్వేలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేశామని డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ ఇక నుంచి అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లను వెండింగ్మిషన్ ద్వారా సులభంగా పొందొచ్చని సూచించారు. ఈ మిషన్లలో ఏప్రాంతానికైనా టికెట్ పొందే అవకాశం ఉంటుందని దీని పేర్కొన్నారు. డివిజన్లో 17 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లును ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో 8, తెనాలి, నెల్లూరు, రాజమండ్రి, కొవ్వురులో మిగిలినవి ఏర్పాటుచేశామని వివరించారు. విజయవాడ మెయిన్ బుకింగ్ కార్యాలయం వద్ద నాలుగు, తూర్పు, దక్షిణ ప్రవేశ ద్వారాల వద్ద రెండేసి మెషిన్లను ఏర్పాటుచేశామని వివరించారు. ప్రయాణికులు రూ.50 చెల్లించి స్మార్ట్ కార్డు కూడా పొందొచ్చన్నారు. ఈ కార్డు ఏడాది పాటు వినియోగంలో ఉంటుందని, దాని సాయంతో దక్షిణ మధ్య రైల్వేలో అన్ రిజర్వుడు టికెట్లను ఏప్రాంతానికైనా తీసుకోవచ్చని సూచించారు. ఈ కార్డును రూ.50 నుంచి రూ.5 వేల వరకూ రీచార్జిచేసుకోవచ్చని తెలిపారు. -
ఇకపై ఇంటివద్దకే రైల్వే టిక్కెట్టు