వాషింగ్టన్: అమెరికాలో ఒక కుటుంబంలోని అక్కాచెల్లెళ్ల తోపాటు వారిలో ఒకరి కుమారుడు.. ముగ్గురికీ ప్రపంచ పోకడ నచ్చక జనాల ఉనికంటూ లేని ప్రదేశానికి వెళ్లి బ్రతకాలనుకున్నారు. చివరికి కొలరాడోలో కఠినాతి కఠినమైన పరిస్థితులకు తాళలేక పస్తులుండి కన్నుమూశారు. గన్నిసన్ కౌంటీ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను అటాప్సీ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గన్నిసన్ కౌంటీ అధికారి మైకేల్ బార్నెస్ తెలిపిన వివరాల ప్రకారం మృతులను క్రిస్టీన్ వాన్స్(41), రెబెక్కా వాన్స్(42), రెబెక్కా వాన్స్ కుమారుడు(14) గా గుర్తించారు. కొలరాడోలోని ఓహియో సిటీకి 14 కిలోమీటర్లకు దూరంలో వీరు దయనీయ స్థితిలో చనిపోయి ఉన్నారని తెలిపారు. ఆకలి బాధలకి తాళలేక ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక చనిపోయి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
విచారణలో భాగంగా రెబెక్కా వాన్స్ బంధువుల్లో ఒకరిని ఆరా తీయగా రెబెక్కాకు ప్రపంచం తీరు నచ్చేది కాదు. తనతోపాటు క్రిస్టీన్ ను తన కుమారుడిని కూడా జనజీవన స్రవంతికి దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి ఒంటరిగా జీవించాలని చెప్తూ ఉండేదని తెలిపారు. అజ్ఞాతంలోకి వెళ్లి బ్రతకడమెలా అని యూట్యూబ్ వీడియోలు చూసి అరకొర అవగాహనతో నిర్మానుష్య ప్రాంతానికి సరైన సిద్ధపాటు లేకుండా వెళ్లిపోవడం వలననే వారు దయనీయంగా మృతి చెందారని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment