
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవాగ్జిన్ వేసుకున్న భారతీయ విద్యార్ధులపై ఆంక్షలను ఎత్తివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశాలు కొవాగ్జిన్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్నారు. అయితే డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్‌వాక్సినేటెడ్” గానే పరిగణిస్తున్నారు.
చదవండి: Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
చదవండి: వృద్ధులపై సొంత ఇంట్లోనే శారీరకంగా, మానసికంగా వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment