
న్యూయార్క్: వాషింగ్టన్ లీస్ట్రీట్ వీధిలోని ఐడియా పబ్లిక్ చార్టర్ స్కూల్ బ్లాక్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతలో ఘటన జరిగినట్టు వాషింగ్టన్ పోలీస్ రాబర్ట్ కాంటె తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. 15 ఏళ్ల యువకుడు ఆ స్కూల్‌లోని ఇద్దరు విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
సదరు నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న దాదాపు 350 మంది విద్యార్థులను, స్కూల్ సిబ్బందిని ఈ విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ అధికారులు మాట్లాడుతూ...ఈ ఏడాది సుమారు రెండు వేల అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతేడాదితో పోల్చితే అదనంగా 800 అక్రమ ఆయుధాలు ఎక్కు ఉన్నాయన్నారు. అదే బుధవారం వేరొక ఘటనలో ఒక భవనం వద్ద మరో బాలుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు.
(చదవండి: 20 ఏళ్ల యుద్ధానికి తెరపడిన రోజు... అఫ్గాన్‌లో మిన్నంటుతున్న సంబరాలు)
Comments
Please login to add a commentAdd a comment